Ustaad Bhagat Singh: పవన్‌ కళ్యాణ్‌ మూవీ టైటిల్‌ మార్చడానికి కారణమదే.. హరీశ్‌ శంకర్ క్లారిటీ..

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో మూవీ 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌ ' (Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్‌ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. వీరిద్దరి కాంబోలో రానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా భారీ అంచనాలు నెలకొన్న మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హరీష్ ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని మోస్తున్నారు. తాజాగా ఓ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'భవదీయుడు'నుంచి 'ఉస్తాద్' వరకు...
ఉస్తాద్ భగత్‌ సింగ్‌ మూవీని మొదట 'భవదీయుడు భగత్ సింగ్'తో ప్రకటించారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్‌ను కొత్త స్టైలింగ్‌తో చూపించాలని హరీష్ శంకర్ ఆలోచించారు. గబ్బర్ సింగ్ లో దాదాపు 80 శాతం సమయం ఖాకీ దుస్తుల్లో కనిపించిన పవన్‌ను ఈసారి అర్బన్ లుక్‌లో చూపించాలని ప్లాన్ చేశారు. అయితే సోషల్ మీడియాలో 'భవదీయుడు' అనే పదం అర్థం ఏమిటి? అనే చర్చలు మొదలవడం, అదే సమయంలో ఇండస్ట్రీలో 'యూనివర్స్' ట్రెండ్ మొదలైందట. గబ్బర్ సింగ్ పాత్రకు అనుసంధానంగా మరో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రను సృష్టించి కథను రీడిజైన్ చేసినట్టు హరీష్ శంకర్ తెలిపారు.

Ustaad Bhagat Singh Harish Shankar Clarifies Title Change Remake Rumours Ahead of March 26 Release

అందుకే టైటిల్‌ను 'ఉస్తాద్ భగత్ సింగ్'గా మార్చినట్లు హరీష్ తెలిపారు. టైటిల్ విషయంలో సందిగ్ధత రావడంతో పాటు, అభిమానులు మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆశించడం వల్ల కథలో మార్పులు జరిగాయని హరీష్ తెలిపారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన కథ, చివరకు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రగా మారుతుందని చెప్పుకొచ్చారు. 'గబ్బర్ సింగ్'లో చెప్పలేకపోయిన కొన్ని అంశాలను ఈ మూవీలో చూపించాలని అనుకున్నామని, అందుకే 'యూనివర్స్' ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కాప్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశామని చెప్పారు. సినిమా ప్రారంభంలోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' టైటిల్ ఎందుకు పెట్టామో క్లారిటీ వస్తుందని వెల్లడించారు.

ఉస్తాద్ సినిమా తమిళ చిత్రం 'తెరి'కి రీమేక్ అన్న ప్రచారాన్ని హరీష్ శంకర్ ఖండించారు. రీమేక్ అయితే ముందుగానే ప్రకటిస్తానని, 'గబ్బర్ సింగ్' విషయంలో కూడా టైటిల్ కార్డ్‌లో 'మాటలు, మార్పులు, దర్శకత్వం' అని స్పష్టం చేశానని తెలిపారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తిగా ఒరిజినల్ కథేనని, రీమేక్ కాదు అని స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు విడుదలైన 'గాజు గ్లాసు' డైలాగ్ రాజకీయాల కోసం రాసిందా? అన్న ప్రశ్నకు హరీష్ స్పష్టం చేశారు. అది పూర్తిగా వ్యక్తిగతంగా రాసిన డైలాగ్ మాత్రమేనని, రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఇక సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండనున్నాయి. ఒక పాటలో పవన్ 350 మంది డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులు వేసినట్లు హరీష్ తెలిపారు. సెట్స్‌లో క్లాప్స్, విజిల్స్ మధ్య పవన్ ఎనర్జీతో మెప్పించారని చెప్పారు. జుట్టు బౌన్స్ అవ్వాలి అని వన్స్‌మోర్ అడిగానని హాస్యంగా చెప్పుకొచ్చారు.

10 ఏళ్ల గ్యాప్ ఎందుకు?
'గబ్బర్ సింగ్' తర్వాత పవన్‌తో మరో సినిమా ఎందుకు ఆలస్యమైంది? అన్న ప్రశ్నకు హరీష్ సమాధానం ఇచ్చారు. పవన్ కెరీర్‌లోనే ఖుషి, కొమరం పులి మధ్య కూడా గ్యాప్ ఉందని, అదే విధంగా తమ రెండో సినిమా కూడా సమయం తీసుకుందని తెలిపారు. సరైన కథ, సరైన టైమ్ కుదిరితేనే కాంబినేషన్ మళ్లీ కుదురుతుందని చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్-హరీష్ కాంబో మాస్ ఫీవర్ సృష్టించబోతుందా? టైటిల్ మార్పు నుంచి కథా మార్పుల వరకు ఆసక్తికర చర్చలకు దారితీసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం మరోసారి పవర్‌స్టార్ మాస్ అవతార్‌ను తెరపై చూడటానికి రెడీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X