ఆ కారణంతో పవన్ కళ్యాణ్ రూ. కోట్లు వదులుకున్నారు.. హరీష్ శంకర్ షాకింగ్ రివిలేషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రావడంతో అభిమానుల్లో హైప్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. సమ్మర్ స్పెషల్‌గా మార్చి 26న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను అధికారికంగా మొదలుపెట్టారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పుల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ సందర్భగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డబ్బుకు ఎప్పుడూ లొంగని వ్యక్తి అని స్పష్టం చేశారు. 'గబ్బర్ సింగ్' ఘన విజయం తర్వాత చాలా మంది నిర్మాతలు, కార్పొరేట్ సంస్థలు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు. అప్పట్లో పాన్ ఇండియా అనే మాట కూడా వినిపించని రోజులు అవి. బాలీవుడ్ స్టార్‌లకు ఇచ్చే స్థాయిలో భారీ యాడ్ ఆఫర్లు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి మంచివి కావని, మరికొన్ని పిల్లలకు హానికరమని స్పష్టంగా చెప్పి తిరస్కరించారు. నా కళ్ల ముందే కోట్ల రూపాయల ఆఫర్లను వదులుకున్నారు. డబ్బుకన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే మనిషి పవన్ కళ్యాణ్ ' అంటూ తన గౌరవాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఆరా ఆఫ్ ఉస్తాద్ (Aura of Ustaad) పాట గురించి మాట్లాడుతూ.. 'ఇది సాధారణ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాదు. ఈ పాటలోని ప్రతి పదం పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే రాసినదే. లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ కలిసి కేవలం ఎనిమిది గంటల్లో ఈ పాటను రెడీ చేశారు. ఇది అభిమానంతో పుట్టిన పాట కాదు... పవన్ కళ్యాణ్ లైఫ్ స్టైల్, సినీ ప్రయాణం, రాజకీయ ప్రస్థానం అన్నింటిపై ఉన్న అవగాహనతో రూపొందిన పాట' అని తెలిపారు.
హరీష్ శంకర్ ఇంకా మాట్లాడుతూ... 'పవన్ కళ్యాణ్‌కు విజయం ఒక్కరోజులో రాలేదు. ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం ఇది. అదే ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. అభిమానులు ఆయనకు పాలాభిషేకం చేస్తే... డీఎస్పీ పాటాభిషేకం చేశారు, చంద్రబోస్ సిరాభిషేకం చేశారు. పవన్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయి' అని అన్నారు.
ఈ వ్యాఖ్యలతో మరోసారి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన విలువల పట్ల ఉన్న నిబద్ధత ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కోట్ల రూపాయల ఆఫర్లను సైతం లెక్కచేయకుండా తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పవర్ స్టార్ తత్వాన్ని గుర్తు చేస్తూ హరీష్ శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత గర్వాన్ని నింపుతున్నాయి. మార్చి 26న విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్పై అంచనాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయని చెప్పొచ్చు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సినిమాకి ప్రధాన హైలైట్‌గా ఉండనుంది. హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్‌బీ శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ వంటి ప్రముఖులు కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. స్క్రీన్‌ప్లేను కె. దశరథ్, రమేష్ రెడ్డి సమకూర్చగా, రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ పని చేశారు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండగా, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











