ఆయన మరణంతో కన్నీళ్లు ఆగలేదు... లెజెండ్‌ని అలా చేయడం పాపం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మార్చి 15న హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన జీవితానికి, కెరీర్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన సంఘటనలు పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సుమ కనకాల ఎప్పటిలాగే అలవోకగా ఈ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్, శ్రీలీల, రాశీ ఖన్నాలతో ఆమె ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటారు కదా? ఏ జోనర్ ఎక్కువగా చదువుతారు అని పవన్ కళ్యాణ్‌ని అభిమానులు ప్రశ్నించారు. అది చూసిన సుమ ఇది.. నేను పవన్ కళ్యాణ్ గారు ఒక పదేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో పుస్తకాల టాపిక్ వచ్చింది. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అసలు పుస్తకాలు చదివే టైం ఉందా అని సుమ అడిగింది. దీనికి పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇస్తూ.. పుస్తకాలు చదువుతున్నా. లేచినప్పుడు ఒక పదిహేను, ఇరవై నిమిషాలు చదువుతాను. రోజు మొత్తం మీద ఒక రెండు గంటలు చదువుతాను అన్నారు.

Ustaad Bhagat Singh Pre-Release Event Pawan Kalyan Shares His Inspiration on Michael Jackson

ఆ వెంటనే అప్పట్లో మీ ఫ్యాషన్ బైక్స్ అన్నారు అని సుమ ప్రశ్నించగా.. అప్పట్లో అంటే 1940, 1960నా అని పవన్ సెటైర్లు వేశారు. మీరెలా మాట్లాడుతున్నారంటే 1940లలో రాజ్‌కపూర్ గారితో యాక్ట్ చేసినప్పుడు అలా మాట్లాడుతున్నారు. తిప్పి కొడితే ఎంత మొన్నే కదా అని నవ్వేశారు పవన్. నేను, ఎస్వీ రంగారావు గారు, కన్నాంబ గారు అందరం కూర్చొని ఉన్నప్పుడు.. ఎన్టీ రామారావు గారు నేను కలిసి ఇలా కాదు కదా అన్నారు పవన్. ఈ ఆన్సర్‌ని నేను కమింగప్‌లో పెట్టుకుంటాను ఈ లోపు నేను వేరే క్వశ్చన్ అడుగుతానని కామెంట్ చేసింది సుమ.

ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఇచ్చిపడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రమని.. అలాగే హరీశ్ శంకర్ గారికి ఎమోషనల్‌గా ఒక గోత్రం ఇవ్వాలనుకుంటే ఏ గోత్రం ఆయనకి కరెక్ట్‌గా సూట్ అవుతుంది అని సుమ ప్రశ్నించారు. దానికి పవన్ స్పందిస్తూ.. అతనికి ఇచ్చిపడేసే గోత్రం. దేనీకి ఊరుకోడు.. నేను ఏదైనా చెప్పినా కానీ వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేస్తాడు. డ్యాన్స్ నేను చేయనని మెంటల్‌గా ప్రిపేర్ అయినా నా చేత కూర్చోబెట్టి.. నా జీవితంలో నేను డ్యాన్స్ చేయగలనో లేదో నాకే డౌట్. అలాంటిప్పుడు నేను సెట్‌లోకి లాక్కొచ్చి వాళ్లందరూ వేస్తుండగా చూస్తూ ఉండేవాడిని. ఎలా వేయాలో నాకు అర్ధమయ్యేది కాదు. మా వాళ్లందరూ కోప్పడతారనే భయంతో డ్యాన్స్ చేశా. మాట అంటే ఉంచుకోడు.. ఇచ్చేయాల్సిందే, ఏదైనా అనుకుంటే చేయించేస్తాడని పవన్ తెలిపారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వేసిన దేఖ్‌లెంగే సాలా సాంగ్‌కి నెటిజన్లు వేసిన ఎడిటింగ్ వీడియోను ప్లే చేసి చూపించగా పవర్‌స్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. మైఖేల్ జాక్సన్ గారిని అలా ఎడిట్ చేయడం కూడా చాలా పాపం. గ్రేట్ స్టార్, లెజెండ్ .. ఆ లెజెండ్‌ని అలా కూర్చోబెట్టి నన్ను బెట్టడం ఒక మైఖేల్ జాక్సన్ అభిమానిగా బాధపడుతున్నా. నా జీవితంలో ఒక పిచ్చిగా ఆరాధించింది ఆల్‌ప్యాచ్‌నో‌తో పాటు నాకు బాగా ఇష్టమైంది, ఈ మాత్రమైనా కాస్త ఒళ్లు కదిలింది అంటే దానికి ఇన్స్‌పిరేషన్‌ మైఖేల్ జాక్సన్. ఆయన చనిపోయినప్పుడు నిజంగా నాకు కన్నీళ్లు వచ్చాయి.. ఇప్పటి వరకు ఈ సందర్భం రాలేదు. నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. అన్నయ్య సినిమాల్లో ఉన్నప్పటికీ నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. కానీ ఆ ఆలోచన వచ్చేలా చేసింది మైఖేల్ జాక్సన్. అలాంటి వ్యక్తిని ఎడిట్ చేయడం చాలా పాపం అని పవన్ ఆన్సర్ ఇచ్చారు.

ఇక శ్రీలీల ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్‌లా డాన్స్ చేయకపోవడం తనను ఆవేదనకు గురిచేసిందని సుమ చెప్పగా.. నేను ముందే హరీశ్‌కు చెప్పా. శ్రీలీల డ్యాన్స్ చేస్తే నేను డ్యాన్స్ చేయనని చెప్పేశా. ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తుంది... నేనే కనిపించాలి, ఇంకెవరూ కనిపించకూడదని చాలా ఆంక్షలు పెట్టి చేయించానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X