Ustaad Bhagat Singh: ఉస్తాద్ గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? పవన్ మూవీ ట్రైలర్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ఇటీవల ఊపందుకొన్నాయి. టీజర్, సాంగ్ రిలీజ్ ప్రమోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. యూట్యూబ్‌లో ఈ సినిమా టీజర్ మోస్ట్ పాపులర్ మూవీ ధురంధర్ 2 సినిమా కంటెంట్‌ను డామినేట్ చేస్తున్నది. ఈ క్రమంలో ఈ సినిమా కంటెంట్‌ను అభిమానులకు, ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ తమ వ్యూహాన్ని సిద్దం చేస్తున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా అభిమానుల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ముఖ్య అతిథి ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..

భారీగా సాంగ్ రిలీజ్‌
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా పాటను మార్చి 12వ తేదీన బాలనగర్ విమల్ థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఈ వేడుకలో పాలు పంచుకొంటారు. ఈ సాయంత్రం 4 గంటల నుంచి గీతావిష్కరణ అభిమానులు ఆనందో సందోహాల మధ్య జరుగనున్నది.

Ustaad Bhagat Singh Pre Release Event Venue Date

ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
పవన్ కల్యాణ్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 15వ తేదీ ఆదివారం రోజున ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకసారి పర్మిషన్ లభించగానే వేడుకకు సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఈ వేడుకలో ముఖ్య అతిథిని ప్రత్యేకంగా పిలవడం లేదు. పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. త్రివిక్రమ్, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

ట్రైలర్ రిలీజ్ కోసం
ఇక ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే జరిగే అవకాశం ఉంది. ఈ ట్రైలర్‌ కోసం టీమ్ తుది మెరుగులు దిద్దుతున్నారు. సాంకేతిక పనులు వేగంగా జరుగుతున్నాయి. అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా డైలాగ్స్, మసాలా కంటెంట్ దట్టించే పనిలో దర్శకుడు హరీష్ ఉన్నట్టు సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటించారు.

రిలీజ్ డేట్: ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్‌: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X