ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ లాక్.. పవన్ కళ్యాణ్ మూవీ థియేటర్‌‌లోకి ఎప్పుడంటే?

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వడివడిగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Ustaad Bhagat Singh Release Date Pawan Kalyan and Harish Shankar s High-Voltage Film to hit screens on march 2026

తేరీకి రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్?
ఉస్తాద్ భగత్ సింగ్‌ స్క్రిప్ట్‌కు సంబంధించి చిత్ర పరిశ్రమలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నటించిన తేరికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే తేరీ నుంచి మాతృకను తీసుకుని దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా హరీశ్ శంకర్ మార్పులు చేసినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. చాలారోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో పాటు ఓజీ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత రానున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై మంచి హైప్ నెలకొంది.

ఉస్తాద్ భగత్ సింగ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్
ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌ ఓ రేంజ్‌లో జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఏరియాల వారీగా నిర్మాతలకు కళ్లు చెదిరే ఆఫర్లు ఇస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఉస్తాద్ నిర్మాతలు కొంతకాలం వేచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్‌పై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తొలుత వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు నిర్మాతలు హింట్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో పెద్ది, విశ్వంభర, లెనిన్, ధురంధర్ 2, టాక్సిక్ సహా చిన్నా పెద్దా సినిమాలు క్యూలో ఉండటంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఊహాగానాలకు చెక్ పెట్టింది. సమ్మర్ కానుకగా ఈ ఏడాది మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని విడుదల చేస్తామని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దాంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఓజీతో చరిత్ర సృష్టించిన పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్‌తోనూ మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X