Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ రీమేకా? పవన్ కల్యాణ్ మూవీ అసలు కథ లీక్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా, గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఆయనంకా బోస్, ఎడిటర్‌: కార్తీక్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా థెరీ రీమేకా? ఒరిజినల్ కథతో వస్తున్నాదా? అనే విషయాలపై అనేక ఊహాగానాలు మీడియాలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయంలోకి వెళితే..

Ustaad Bhagat Singh Story Revealed

విజయ్, సమంత జంటగా నటించగా, అట్లీ దర్శకత్వంలో రూపొందిన థెరీ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా కథ తెరకెక్కుతున్నదనే ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తొలుత చిత్ర యూనిట్ గానీ, నిర్మాత, దర్శకులు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయారు. అయితే ఇటీవల కాలంలో థెరీ సినిమాకు మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే తాను కథ, మాటలు, స్క్రీన్ ప్లే నా పేరుతో వస్తున్నాయి అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా బుక్ మై షో వెబ్ సైట్‌లో ఈ సినిమా సంక్షిప్త కథను మార్చుతూ అప్ డేట్ చేయడం జరిగింది. తొలుత ఈ సినిమా కథ ఏమిటనే వివరాల్లోకి వెళితే.. శత్రువులు కక్ష కట్టి ఫ్యామిలీని చిన్నాభిన్నం చేయడంతో ఓ ఐపీఎస్ ఆఫీసర్ తన కూతురుతో కలిసి అజాతంలోకి వెళ్తాడు. కొన్నేళ్ల తర్వాత ఆయన ఆచూకీని కొందరు కొనుగొంటారు. అయితే మిగిలి ఉన్న ఫ్యామిలీని రక్షించుకోవడానికి ఆయన తన శత్రువులను ఊచకోత కోసేందుకు సిద్దమవుతాడు అని బుక్‌ మై షోలో పేర్కొన్నారు.

అయితే తాజాగా మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్‌లో వెల్లడించిన ప్రకారం.. భగత్ సింగ్ అనే యువకుడు గిరిజన తెగకు చెందిన వాడు. తన టీచర్ అందించిన స్పూర్తితో తన జీవితాన్ని విలువలు, నైతికతతో కొనసాగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అన్యాయాన్ని, అక్రమాలను ఎదుర్కోవడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా గానీ సమాజంలోని చీడ పురుగులను ఏరి వేయడంలో వెనకడుగు వేయడు. ఉస్తాద్ భగత్ సింగ్ కథ ఓ వ్యక్తికి సంబంధించిన ధైర్య సాహాసాలు మాత్రమే కాదు. దేశ సమగ్రత, సమైక్యత, ప్రజల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన ధీరుడి స్టోరీ అని తాజాగా ఈ సినిమా కథ రివీల్ చేశారు

ఈ సినిమా కథ గురించి, అలాగే రీమేకా? ఫ్రీమేకా? హరీష్ శంకర్ ఒరిజినల్ కథనా? అనే రూమర్లకు చెక్ పెట్టారు. ఏ సినిమా ఆధారంగా కూడా నిర్మించడం లేదని సంకేతాలు అందించారు. వాస్తవానికి ఈ సినిమాను మార్చి 27వ తేదీన రిలీజ్ చేయాలని అధికారికంగా ప్రకటన చేశారు. టాక్సిక్ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ కార్యక్రమాల వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X