Ustaad Bhagat Singh:దేవిశ్రీ అవుట్.. తమన్ ఎంట్రీ! ‘ఉస్తాద్ భగత్ సింగ్' ట్విస్ట్ వెనుక అసలు కథ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). గతంలో 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా మూవీకి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ మూవీ మ్యూజిక్ విభాగంపై పెద్ద చర్చ నడుస్తుండగా, ఇప్పుడు ఆ ప్రచారాలకు ముగింపు పలుకుతూ నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఆ ప్రచారం ఏంటీ? ఆ షాకింగ్ నిర్ణయం ఏంటీ?

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పవన్ కళ్యాణ్ లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అధికారికంగా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించకపోయినా, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Ustaad Bhagat Singh Update Thaman Replaces DSP for Background Score in Pawan Kalyan Film

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)సంస్థ ప్రకారం, సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను సంగీత దర్శకుడు ఎస్.థమన్ కి అప్పగించినట్లు అధికారికంగా వెల్లడించారు. మొదటగా ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా ఉన్న దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)స్థానంలో ఇప్పుడు తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చినట్లైంది. అయితే ఈ మార్పు వెనుక ఎలాంటి విభేదాలు లేవని మేకర్స్ స్పష్టంచేశారు.

దేవిశ్రీ ప్రసాద్ , మూవీ యూనిట్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదని తెలిపారు. కేవలం సమయాభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూవీ మేకర్స్ నుంచి అవసరమైన కంటెంట్ సమయానికి అందకపోవడం, అదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్ ఇతర పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావించారు. సినిమా విడుదలలో జాప్యం జరగకుండా ఉండేందుకు తక్షణమే తమన్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

పుష్ప 2 తరహా పరిస్థితి?

ఇండస్ట్రీలో ఇదే తరహా పరిణామం గతంలో కూడా చోటు చేసుకుంది. పుష్ప 2 (Pushpa 2: The Rule) సినిమా విషయంలో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సినిమాకి కూడా తమన్‌తో పాటు ఇతర సంగీత దర్శకులు కలిసి పనిచేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఆ సినిమాను కూడా ఇదే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దీంతో వరుసగా భారీ ప్రాజెక్టుల్లో మ్యూజిక్ విభాగంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? ఫైనల్ అవుట్‌పుట్‌ను మెరుగుపరచడానికేనా? లేక రిలీజ్ డెడ్‌లైన్ కారణమా? అనే చర్చలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ అంచనాలు
ప్రస్తుతం టాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మాస్ యాక్షన్ సన్నివేశాలకు ఎలివేషన్ ఇచ్చే మ్యూజిక్ అందించడంలో ఆయనకు మంచి పేరు ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో తమన్ ఇచ్చే స్కోర్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఇలా దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ ఎంట్రీ ఇవ్వడం 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రాజెక్ట్‌కు మరో కొత్త ట్విస్ట్‌ను తీసుకొచ్చింది. ఈ మార్పు సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X