Ustaad Bhagat Singh Vs Dhurandhar 2: రణ్‌వీర్ పై పవన్ కళ్యాణ్ పైచేయి.. దుమ్మురేపుతున్న ‘ఉస్తాద్ '

Ustaad Bhagat Singh Vs Dhurandhar 2: సినిమాల మ‌ధ్య పోటీ చూడ‌డం కొత్తేం కాదు. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ భారీ సినిమాల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం ఓ తెలుగు సినిమాతో ఓ హిందీ సినిమా పోటీ ప‌డ‌బోతోంది. ఈనెల 19న 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' వ‌స్తోంది. అదే రోజు 'దురంధ‌ర్ 2' విడుద‌ల అవుతోంది. ఈ క్రమంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు 'దురంధ‌ర్ 2' హోరా హోరీగా పోటీ పడనున్నాయి. అయితే, బాక్సాఫీస్ పోరు కంటే ముందే ఓ విషయంలో పోటీ పడుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏ పోటీ ఏంటి? ఏ విషయంలో రణ్‌వీర్ పై పవన్ కళ్యాణ్ పైచేయి సాధించారంటే?

సినిమా విడుదలకు ముందు ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి రేపుతాయో తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న సినిమా ట్రైలర్ల జాబితా చూస్తే అదే విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టీజ్ తెలుగులో భారీ హంగామా సృష్టిస్తోంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న 'ధురంధర్: ది రివెంజ్' ట్రైలర్ కూడా దుమ్మురేపుతోంది. దేశవ్యాప్తం ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ మాత్రం అంత క్రేజ్ లేదనే చెప్పాలి.

Ustaad Bhagat Singh vs Dhurandhar 2 Pawan Kalyan Beats Ranveer Singh in Telugu YouTube Trending

టాప్ లో పవన్ కళ్యాణ్
అయితే.. తెలుగు యూట్యూబ్ ట్రెండింగ్ మూవీస్ జాబితాలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టీజ్ మొదటి స్థానంలో నిలిచింది. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ టీజ్‌ కేవలం 16 గంటల్లో 1.4 మిలియన్స్ వ్యూస్ అందుకుంది. పవన్ కళ్యాణ్ చెప్పిన 'ఇందాక విన్నది భగవత్ గీత... ఇది భగత్ గీత... దమ్మున్నోడు దాటొచ్చు' అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ టీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇక బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ రివెంజ్ డ్రామా 'ధురంధర్: ది రివెంజ్'. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన ఒక రోజులోనే 41 మిలియన్ వ్యూస్ సాధించింది. ట్రైలర్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు, రణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభినయం, పవర్ పుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

అయితే.. తెలుగు విభాగంలో మాత్రం యూబ్యూట్ ట్రెండింగ్‌‌లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి స్థానం లో నిలువగా, రెండో స్థానంలో ధురంధర్ ఉండటం గమన్హారం.'ఉస్తాద్ భగత్ సింగ్', 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలు రెండూ కూడా మార్చి 19న ఉగాది సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇలా మొత్తంగా యూట్యూబ్ ట్రెండింగ్ చార్ట్స్ చూస్తే తెలుగులో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టాప్‌లో నిలవగా, దేశవ్యాప్తంగా మాత్రం రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' ట్రైలర్ ఆధిపత్యం చాటుతోంది. విడుదలకు ముందే ఈ రెండు సినిమాలు సోషల్ మీడియాలో భారీ హైప్ సంపాదించుకోవడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X