Ustaad Bhagath Singh మోసం చేసిన దర్శకుడు హరీష్ శంకర్.. ఈ పోస్టర్ లో ఉన్నది పవన్ కాదు.. ఎవరంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఫ్యాన్స్ దృష్టిలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. దర్శకుడు ఊహించిన విధంగా సినిమాను విభిన్నమైన తరహాలో ఫాన్స్ కు నచ్చే విధంగానే తెరపైకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ గత రాత్రి విడుదల చేయగా అందులో ఉన్నది పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి అందులో పవన్ కళ్యాణ్ లేడు అని మరొకరు అంటున్నారు. ఇక అతను కూడా స్టార్ సెలబ్రెటీ అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ అతను ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే...

షూటింగ్ స్టార్ట్: మూవీ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీక్వెన్స్ తో ఫస్ట్ డే షూట్ ని హరీష్ శంకర్ గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఇక రెండేళ్ళ నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ తో అనుకుంటున్న మూవీ స్టార్ట్ కావడంతో హరీష్ శంకర్ తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు.
హైప్ పెంచేలా: అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రేంజ్ లో బజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపధ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ పై మరల ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచడం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక పోస్టర్ ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఉస్తాద్ ఊచకోత మొదలైంది అనే ట్వీట్ తో పోస్టర్ షేర్ చేశారు.

గబ్బర్ సింగ్ తరహాలో: ఆ పోస్టర్ కాస్తా వైరల్ అయ్యింది. ఇక హరీష్ శంకర్ కూడా దానిని షేర్ చేశారు. ఇదిలా ఉంటే ఈ పోస్టర్ లో గబ్బర్ సింగ్ తరహాలో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపించాడు. అయితే ఈ లుక్ పవర్ స్టార్ అభిమానులకి కిక్ ఇచ్చింది. కాని కొంత మంది మాత్రం ఈ పోస్టర్ లో పోలీస్ గెటప్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదని అనుమానిస్తున్నారు.
లుక్ వైరల్: పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ పెర్ఫెక్ట్ గా తెలిసిన వ్యక్తి హరీష్ శంకర్, అలాగే అతనిని ఎలా చూపిస్తే ఆడియన్స్ ని కనెక్ట్ అవుతుందో కూడా దర్శకుడు హరీష్ శంకర్ కి క్లారిటీ ఉంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ స్టైల్ బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ తో ఒక చేతిలో టీ గ్రాస్, మరో చేతిలో గన్ తో ఉన్న స్టైలిష్ లుక్ ని రివీల్ చేశారు.

అతను హరీష్ శంకర్: లుక్ పరంగా సూపర్ అనిపించుకున్న ఆ గెటప్ లో ఉన్నది అసలు పవన్ కళ్యాణ్ కాదనే అనుమానం అందరికి వస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ అలా పవన్ కళ్యాణ్ స్టైల్ గా ఫోజులు ఇచ్చి ఫోటోషూట్ చేసి పోస్టర్ ని రిలీజ్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు కామెంట్స్ రూపంలో కూడా ప్రస్తావిస్తూ ఉండటం విశేషం. ఊఆ విధంగా అది నిజమే అనేలా ఉంది. ఏది ఏమైనా ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊపు తీసుకొస్తే, పవన్ ని ద్వేషించే వారికి మాత్రం విమర్శలకి తావిచ్చేలా ఉందనే మాట వినిపిస్తుంది.


Click it and Unblock the Notifications











