Ustaad Teaser Review పేలవంగా.. రొటీన్‌గా ఉస్తాద్ టీజర్.. ఆకట్టుకోని హీరో సింహా!
దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో సింహా కోడూరి హీరోగా రాణించడానికి తంటాలు పడుతున్నాడు. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త లాంటి చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో సింహా కోడూరి ప్రస్తుతం హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మత్తు వదలరా సినిమా బాగుందనే టాక్ వినిపించినప్పటికీ.. ఆ సినిమాకు రావాల్సిన మైలేజ్ రాలేకపోవడం, ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ కాసుల వర్షం కురిపించలేకపోయాయి. దాంతో ప్రస్తుతం ఉస్తాద్ అనే సినిమాపై ఆశలుపెట్టుకొన్నాడు. తాజాగా ఉస్తాద్ టీజర్‌ను బుధవారం (ఏప్రిల్ 12వ) తేదీన టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఆ సినిమా టీజర్ ఎలా ఉందంటే?
ఉస్తాద్ టీజర్ విషయానికి వస్తే.. ఓ డొక్కు బైక్ మీద తిరిగే యువకుడికి ఎత్తు నుంచి చూస్తే కళ్లు తిరిగే లోపం ఉంటుంది. అలాంటి వ్యక్తి విమానం పైలెట్‌గా మారడం అనే పాయింట్ టీజర్‌లో కనిపించింది. తండ్రి, కొడుకు మధ్య సెంటిమెంట్, మధ్య చిన్న ప్రేమ కథ ఉందనే విషయం టీజర్ స్పష్టం చేసింది. అయితే ఇందులో ఆకట్టుకొనే విధంగా సన్నివేశాలు లేకపోవడం.. రెగ్యులర్, రొటీన్ టీజర్‌గా కనిపించింది.

మసూద, బలగం లాంటి భారీ హిట్లు అందుకొన్న కావ్య కల్యాణ్ రామ్ ఉస్తాద్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ ప్రేమ కథలో కావ్య పాత్ర ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తిగా మారింది. మంచి పాత్రలు ఎంచుకొంటూ వెళ్తున్న కావ్యకు మళ్లీ ప్రశంసలు అందుకొంటుందా? అనే విషయం ఆసక్తిగా మారింది.
ఉస్తాద్ సినిమా విషయానికి వస్తే.. నూతన సంగీత దర్శకుడు ఆకీవ బీ అందించిన మ్యూజిక్ కొంత స్పెషల్ ఎట్రాక్షన్‌గా అనిపించింది. రీరికార్డింగ్ టీజర్‌లో బాగుంది. పవన్ కుమార్ పప్పుల సినిమాటోగ్రఫి ఆకట్టుకొనేలా ఉంది. సినిమా టాక్ బాగున్నదన్నా లాభాలు తెచ్చిపెట్టని పరిస్థితి వరాహి చలన చిత్రం బ్యానర్‌కు ఉంది. ఉస్తాద్ సినిమానైనా ఈ బ్యానర్ మంచి హిట్ తెచ్చి పెడుతుందా అనేది వేచి చూడాల్సిందే.
నటీనటులు: శ్రీ సింహా కోడూరి, కావ్య కల్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా, రవిశివ తేజ, సాయి కిరణ్ ఏడిద తదితరులు
రచన, దర్శకత్వం: ఫణిదీప్
నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
సినిమాటోగ్రఫి: పవన్ కుమార్ పప్పుల
మ్యూజిక్: అకీవ బీ
ఎడిటర్: కార్తీక్ కట్స్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
బ్యానర్: వరాహి చలన చిత్ర


Click it and Unblock the Notifications











