ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడంటే? పవన్ మూవీ డేట్ లీక్ చేసిన ప్రొడ్యూసర్
తన జీవితాన్ని రాజకీయాలకి పూర్తిగా అంకితం చేసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తిరిగి వెండితెర మీద చూడగలమా? లేదా? అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిని పటపంచెలు చేస్తూ ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో అభిమానులను పలకరించారు పవర్‌స్టార్. వీరమల్లు నిరాశపరిచినా .. ఓజీతో బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించారు జనసేనాని. కెరీర్‌లోనే తొలిసారిగా 300 కోట్ల మార్క్‌ను ఆయన అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఓ సినిమా ఉంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్.
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తోంది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

తేరీకి రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్?
ఉస్తాద్ భగత్ సింగ్‌లో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్ వేశారు. కోలీవుడ్ సూపర్‌స్టార్, ఇళయ దళపతి విజయ్ నటించిన తేరికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగు నేటివిటీకి అనుగుణంగా హరీశ్ శంకర్ కథలో పూర్తి స్థాయిలో మార్పులు చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. వీరమల్లు, ఓజీలను రికార్డ్ సమయంలో పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. ఉస్తాద్‌ను కూడా వీలైనంత త్వరగా ముగించి నిర్మాతలను ఒడ్డున పడేయ్యాలని భావిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసిన పవన్
పవన్ కళ్యాణ్ నటించాల్సిన పోర్షన్‌ను దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలోని మిగిలిన నటీనటులతో షూటింగ్‌ను హరీశ్ పరుగులు పెట్టిస్తున్నట్లుగా టాక్. అయితే ఈ సినిమా నుంచి అప్పట్లో ఓ గ్లింప్స్ తప్పించి పెద్దగా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీనికి తెరదించుతూ దర్శకుడు హరీశ్ శంకర్ బిగ్‌న్యూస్ చెప్పారు. డిసెంబర్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాంగ్‌ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దాంతో పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఉస్తాద్ రిలీజ్ ఎప్పుడు?
తొలుత ఉస్తాద్ భగత్ సింగ్ డిసెంబర్ లేదా సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే డిసెంబర్‌లో నందమూరి బాలకృష్ణ అఖండతో పాటు పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. సంక్రాంతికి ప్రభాస్, చిరంజీవి, రవితేజల చిత్రాలతో పాటు కోలీవుడ్ నుంచి ఇళయ దళపతి విజయ్ చివరి చిత్రం జననాయగన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇవికాక మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి లేదా జనవరిలో కర్చీఫ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మైత్రీ రవిశంకర్ కీలక వ్యాఖ్యలు
దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా.. వాటికి చెక్ పెట్టారు మైత్రీ నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ టీమ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన.. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదలవుతుందని లీక్ చేసేశారు. వీటితో పాటు జై హనుమాన్, ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ, పెద్ది, ఫౌజీ సినిమాలపైనా రవిశంకర్ కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం రవిశంకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు.


Click it and Unblock the Notifications










