అనుకున్నట్లే అయ్యింది.. ఓటీటీ లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్ టీమ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కటిగా చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇప్పట్లో అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకేవేళ థియేటర్స్ ఓపెన్ అయినా కూడా అంత ఆసక్తిగా జనాలు సినిమాలు చూడటానికి రాకపోవచ్చు. దీంతో వచ్చిన ఆఫర్స్ తోనే సరిపెట్టుకొని ఓటీటీ కంపెనీలకు సినిమాలను అమ్మేస్తున్నారు.
ఇక ప్రభాస్ స్నేహితలైన యూవీ క్రియేషన్స్ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ ను స్థాపించి అందులో మంచి కంటెంట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇక యువ హీరో సంతోష్ శోభన్ తో ఒక బోల్డ్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఏక్ మినీ కథ అనే ఆ సినిమా గత నెలలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో వాయిదా వేసుకొని మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతే విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో యూవీ నిర్మాతలు సినిమాను ఓటీటీ లోనే విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ సినిమా డైరెక్ట్ రిలీజ్ హక్కులను దాదాపు 9కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్ వస్తోంది.
ఇక సినిమా మే 27 నుంచి ఆ డిజిటక్ వరల్డ్ లో సందడి చేయనుంది. ఈ సినిమాతో ఎలాగైనా హీరోగా నిలదొక్కుకోవాలని సంతోష్ శోభన్ చాలానే కష్టపడ్డాడు. ప్రభాస్ వల్లే అతనికి ఈ అవకాశం వచ్చింది. వర్షం దర్శకుడు శోభన్ కొడుకే ఈ సంతోష్. ఆ దర్శకుడి మరణం తరువాత శోభన్ కు ప్రభాస్ అన్నగా సపోర్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











