ప్రభాస్, పూజా హెగ్డే గోడవ.. క్లారిటీ ఇచ్చిన రాధేశ్యామ్ టీమ్.. అసలు నిజం ఇదే!
పాన్ ఇండియా సినిమాలను లైక్ చేసే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'రాధే శ్యామ్' టాప్ లిస్టులో ఉంది. సాహో అనంతరం ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే సినిమా హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే మధ్య మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఇటీవల అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. సినిమా సెట్‌లోకి హీరోయిన్ పూజా కాస్త ఆలస్యంగా వస్తుందని ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా చిత్ర యూనిట్ మాటలను ఆమె పట్టించుకోవడం లేదని కొన్ని మీడియాలలో కథనాలు గట్టిగానే వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ నచ్చజెప్పినా కూడా ఆమె పట్టించుకోలేదని దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు టాక్ వచ్చింది. ఇక ఆ విషయంలో యూవీ క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది.

అందులో నిజం లేదు..
ఇక ఇటీవల చిత్ర నిర్మాతలు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. అలాంటి విబేధాలు ఏమి లేవని స్పష్టం చేస్తూ, చిత్ర నిర్మాతలు యువి క్రియేషన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
'రాధే శ్యామ్' షూటింగ్ లో ప్రభాస్ మరియు పూజా హెగ్డే మధ్య విభేదాలు వచ్చినట్లు వస్తున్న వార్తలు పుకార్లు పూర్తిగా అబద్దమని అని అన్నారు. ఇద్దరు నటులు ఒకరిపై ఒకరు గొప్ప గౌరవం మరియు ప్రశంసలు కలిగి ఉన్నారు అని వారు వివరణ ఇచ్చారు.

ఎలా ఉంటారంటే..
ఇటీవల వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పూర్తిగా అబద్దాలే. ప్రభాస్ మరియు పూజా హెగ్డే ఒకరిపై ఒకరు మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉన్నారు. చాలా ఫ్రెడ్లిగా ఉంటూ ఒకరి గురించి మరొకరు పాజిటీవ్ గా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి, వారు ఆఫ్-స్క్రీన్‌లో గొప్ప స్నేహాన్ని పంచుకుంటారు అంటూ ముఖ్యంగా తెరపై కెమిస్ట్రీ సెట్టయ్యిందని.. UV క్రియేషన్స్ పేర్కొంది.

చాలా ఈజీగా ఉంటుంది..
సెట్స్‌కి హీరోయిన్ పూజా ఆలస్యం వస్తున్నట్లు కొన్ని రూమర్స్ రాగా వాటి గురించి మాట్లాడుతూ.. పూజా తన షూట్‌ల కోసం నిరంతరం సరైన టైమింగ్ ను ఫాలో అవుతూ వచ్చింది. ఆమెతో పని చేయడం చాలా ఈజిగానే ఉంటుంది. ఈ రూమర్లు కేవలం ఊహాగానాలు మాత్రమే. అంతా సవ్యంగానే ఉంది. ప్రభాస్ పూజా హెగ్డేతో పాటు మొత్తం చిత్ర బృందం ప్రేక్షకులకు మర్చిపోలేని థియేట్రికల్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్
రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా ప్రేమ కథ 1970 యూరప్ యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇటలీ, జార్జియా మరియు హైదరాబాద్ లొకేషన్స్ లలో సినిమా షూటింగ్ ను నిర్వహించారు. 'రాధే శ్యామ్' కోసం దాదాపు 250కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్‌లతో ప్రభాస్ మరియు పూజలను మునుపెన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేస్తారట.
Recommended Video

బాక్సాఫీస్ ఫైట్.. తగ్గేదే లే..
అసలైతే రాధేశ్యామ్ సినిమాను ఈపాటికే విడుదల చేయల్సింది. దసరా సమయంలో కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల వలన రిస్క్ చేయడానికి ఇష్టపడని నిర్మాతలు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ప్రభాస్ సినిమా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరి ఈ బాక్సాఫీస్ పోటీలో పాన్ ఇండియా స్టార్ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











