మరోసారి బయట పడ్డ యూవీ క్రియేషన్స్ అజాగ్రత్త.. కృష్ణం రాజు విషయంలో అదే తప్పు మళ్లీ మళ్లీ!

ముందు నుంచి రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్న యు.వి.క్రియేషన్స్ సంస్థ మీద ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వచ్చారు. చెప్పిన సమయానికి అప్డేట్స్ ఇవ్వక పోవడమే కాక చాలా రోజుల పాటు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఉండేవారు. దానికి తోడు కొద్ది రోజుల క్రితం ట్రైలర్ లో చేసిన తప్పు మళ్ళీ సినిమా విషయంలో కూడా చేసి మరోసారి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు మూవీ క్రియేషన్స్ నిర్వాహకులు. అసలేం జరిగింది ? ట్రైలర్ లో జరిగిన తప్పు సినిమా విషయంలో ఏమి రిపీట్ అయింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనేక వాయిదాల అనంతరం

అనేక వాయిదాల అనంతరం


సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, మురళి శర్మ, ప్రియదర్శి లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ ల మీద ఈ సినిమాను వంశీ, ప్రమోద్, ప్రసీద కలిసి సంయుక్తంగా నిర్మించారు.. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొనగా అనేక వాయిదాల అనంతరం మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇతర భాషల కోసం సత్యరాజ్ ని

ఇతర భాషల కోసం సత్యరాజ్ ని

అయితే ముందు నుంచి కూడా సినిమాలో కీలకమైన పరమహంస అనే సాధువు పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అమెరికా వెళ్లిన తెలుగు ప్రింట్ లలో మాత్రం కృష్ణంరాజు ఎక్కడా కనిపించడు. కృష్ణంరాజు స్థానంలో తమిళ నటుడు సత్యరాజ్ కనిపించడంతో తెలుగు అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. నిజానికి తెలుగు వరకు కృష్ణంరాజును తీసుకోవాలని ఇతర భాషల కోసం సత్యరాజ్ ని తీసుకోవాలని సినిమా యూనిట్ ముందే నిర్ణయం తీసుకుంది.

 పరమహంస పాత్ర కోసం

పరమహంస పాత్ర కోసం


బాహుబలి సినిమాలో పోషించిన కట్టప్ప పాత్రతో సత్యరాజ్ హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. తెలుగులో కూడా అతనికి క్రేజ్ ఉంది కానీ కృష్ణంరాజుతో పోల్చుకుంటే అది తక్కువే. కృష్ణంరాజుకు ఇతర భాషలలో పెద్ద క్రేజ్ లేదనే చెప్పాలి. అందుకే నిర్మాతలు తెలివిగా కేవలం తెలుగు వర్షన్ కోసం కృష్ణంరాజును తీసుకుని మిగతా అన్ని భాషల కోసం పరమహంస పాత్ర కోసం సత్యరాజ్ ను ఎంపిక చేసుకున్నారు.

 వెంటనే రంగంలోకి దిగి

వెంటనే రంగంలోకి దిగి


గతంలో తెలుగు ట్రైలర్ విడుదల చేసిన సమయంలో కృష్ణంరాజు కనిపించాల్సిన స్థానంలో సత్యరాజ్ కనిపించాడు.. ఈ విషయం గుర్తించిన నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడంతో తప్పు తెలుసుకున్న సినిమా యూనిట్ వెంటనే రంగంలోకి దిగి ఆ ట్రైలర్ అప్పటికప్పుడు డిలీట్ చేసి వెంటనే కృష్ణంరాజు ఉన్న కొత్త ట్రైలర్ అప్లోడ్ కూడా చేశారు.

Recommended Video

Radhe Shyam లో Prabhas కి ఉండే వరమే .. ఆఖరికి శాపంలా మారుతుంది | Filmibeat Telugu
 అదే తప్పు

అదే తప్పు


ఇప్పుడు కూడా అదే తప్పు చేసింది సినిమా యూనిట్. అమెరికా వెళ్లే తెలుగు ప్రింట్లు చూశారో లేదో తెలియదు కానీ ఆ ప్రింట్లలో కృష్ణంరాజు మిస్ అయ్యారు. అమెరికా సహా మరికొన్ని దేశాలకు వెళ్లిన తెలుగు ప్రింట్లలో కృష్ణంరాజు స్థానంలో సత్యరాజ్ కనిపించడంతో ప్రేక్షకులు అందరూ నిరాశకు గురయ్యారు. ప్రభాస్ అభిమానులు అయితే ఇలాంటి తప్పులు ఎన్నిసార్లు చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా మూవీ క్రియేషన్స్ వారిని నిలదీస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X