Radhe Shyam Postponed: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు.. మళ్ళీ ఎప్పుడంటే?
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా కూడా వాయిదా పడింది. గత కొంత కాలంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RRR సినిమా వాయిదా పడినప్పటికీ కూడా రాధే శ్యామ్ తప్పకుండా థియేటర్ లోకి వస్తుంది అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ప్రభాస్ అభిమానులకు యు.వి.క్రియేషన్స్ బ్యాడ్ న్యూస్ చెప్పేసింది. సినిమా వాయిదా పడింది అంటూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

రెండు సినిమాలు వాయిదా
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి కరోనా వైరస్ దెబ్బ గట్టిగానే ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. కరోనా సెకండ్ వెర్షన్ అనంతరం ఓమిక్రాన్ కూడా అదే తరహాలో చిత్రపరిశ్రమలోని బిజినెస్ ను మళ్ళీ తగ్గించేలా చేస్తోంది. 2022 సంక్రాంతికి మళ్లీ ఎప్పటిలానే చిత్రపరిశ్రమలు కళకళలాడుతూ కనిపిస్తుంది అని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా RRR సినిమా రాధేశ్యామ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి అని అనుకుంటే చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

థియేటర్స్ లోకి వస్తుందని అనుకుంటే..
రాధేశ్యామ్ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు గత వారం నుంచి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ మాత్రం సినిమా తప్పకుండా వస్తుంది అనే విధంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ వస్తున్నారు. అభిమానులు కూడా చాలావరకు సినిమా ధియేటర్స్ లో కి వస్తుందని ఆశ పడ్డారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం ఎవరికీ అంత శ్రేయస్కరం కాదు అని చిత్ర యూనిట్ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

వాయిదా వేయక తప్పడం లేదు
రాధేశ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తాము చాలా ప్రయత్నాలు చేశామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఓమిక్రాన్ భయంకరంగా మారుతూ ఉండటంతో వాయిదా వేయక తప్పడం లేదు అని క్లారిటీ ఇచ్చేశారు. మరి కొంతకాలం పాటు స్క్రీన్ లోకి రావడానికి వెయిట్ చేయక తప్పదు అని చెప్పిన రాధేశ్యామ్ యూనిట్ ఈ సినిమా లవ్ వర్సెస్ డెస్టిని తరహాలో ఉంటుందని తప్పకుండా మీ ప్రేమ కూడా మాకు చాలా హెల్ప్ అవుతుందని తెలిపారు..

మళ్ళీ ఎప్పుడు?
అయితే రాధేశ్యామ్ సినిమా మళ్ళీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయంలో మాత్రం ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తొందరగానే థియేటర్స్ లో కి రాధేశ్యామ్ వస్తుందని అన్నారు. కానీ ఎప్పుడు వస్తుంది అనే విషయం లో క్లారిటీ లేదు.. చూస్తుంటే ఈ సినిమా కూడా సమ్మర్ లో పోటీపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటీటీ ఆఫర్ రిజెక్ట్..?
రాధేశ్యామ్ సినిమాకు ఓటీటీ నుంచి చాలా పెద్ద ఆఫర్స్ వచ్చాయి. ఒక సంస్థ 300 కోట్లకు పైగా డీల్ సెట్ చేసుకునే విధంగా మాట్లాడినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ యు.వి.క్రియేషన్స్ మాత్రం 350 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా కూడా టాక్ వచ్చింది. కానీ ఆ డీల్ ఎందుకు సెట్ అవ్వలేదో ఎవరికీ తెలియలేదు. ఏదేమైనా కూడా చిత్ర నిర్మాతలు సినిమాను థియేట్రికల్ గానే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు దర్శనమిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











