Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిన్న సినిమాలపై దృష్టి పెట్టిన పెద్ద బ్యానర్
యూవీ క్రియేషన్స్ .. ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్స్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. వరుసగా శర్వానంద్ తో రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా , మహానుభావుడు సినిమాలని నిర్మించారు. రెబల్ స్టార్ ప్రభాస్ హోమ్ బ్యానర్ అయినా యూవీ క్రియేషన్స్ లో దాదాపు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే తెరకెక్కాయి.
ప్రభాస్ నటించిన సాహో , ఇప్పుడు నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలకు సైతం యూవీ క్రియేషన్స్ సహ నిర్మాతలుగా వ్యవహరించింది. రాధేశ్యామ్ సినిమాకూడా దాదాపు 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం యువీ క్రియేషన్స్ చిన్న సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మోడల్, నటి కావ్య థాపర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఒకేసారి 5 చిన్న సినిమాల్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందట యువీ క్రియేషన్స్ . ఓ రకంగా... బిగ్ బ్యానర్ చేస్తున్న బిగ్గెస్ట్ ఎక్స్‌పెర్‌మెంట్ ఇది. అదే విధంగా గీతా ఆర్ట్స్ ఇప్పటికే చిన్న సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతుంది .మైత్రి మూవీ మేకర్స్ కూడా అడపాదడపా చిన్న సినిమాలను చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2021లో యూవీ నుంచి దాదాపు 6 సినిమాలు రాబోతున్నాయని తెలుస్తుంది. అందులో ప్రభాస్ రాధేశ్యామ్ ఒకటి . అది కాకుండా మరో 5 చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. వీటితోపాటు ఇక వీటితోపాటు కొన్ని వెబ్ సిరీస్‌లనూ రూపొందించాలన్న ప్లానింగ్స్‌లో ఉంది యూవీ. మొత్తానికి యూవీ క్రియేషన్స్ కొత్త టాలెంట్ కి వెన్నుదన్నుగా నిలుస్తోందన్నమాట.