స్టార్ దర్శకులతో ప్రభాస్ టీమ్ వెబ్ సిరీస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యువ హీరోలు
కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీలలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ షూటింగ్స్ లలో కూడా విజృంభిస్తోంది. దీంతో షూటింగ్స్ కి మరోసారి బ్రేక్ పడింది. ఇక థియేటర్స్ ఇప్పట్లో తెరచుకునేలా లేవని అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. తెరచుకున్నా కూడా జనాలు థియేటర్స్ లోకి వచ్చి సినిమాలు చూస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది.
ఇకపోతే చివరికి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ దిక్కని చాలా వరకు వెబ్ సిరీస్ లని ప్లాన్ చేసుకుంటున్నారు కొందరు. త్వరలో ప్రభాస్ టీమ్ యూవీ క్రియేషన్స్ కూడా వెబ్ సిరీస్ లను గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతోందట. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ డైరెక్టర్స్, యువ హీరోలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అందులో స్టార్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్, సుజిత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక యూవీ క్రియేషన్స్ లో సినిమా అంటే వర్క్ చేయడానికి యువ హీరోలు చాలా మంది రెడీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇద్దరు హీరోలకు అయితే వెబ్ సిరీస్ ప్లానింగ్ గురించి చెప్పారట. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ మొత్తం సెట్టయితే వీలైనంత త్వరగా వెబ్ సిరీస్ లను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











