జగన్ సర్కారు దెబ్బకు.. ఇండియా బిగ్గెస్ట్ థియేటర్ క్లోజ్.. స్టార్ హీరో అప్సెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సినిమా థియేటర్స్ పై కొత్త జీవో అమలు చేయడంపై ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొంది. అయితే ఈ విషయంలో సినీ పెద్దలు స్పందించే విధానం కూడా చాలా విభిన్నంగా ఉంది చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలకు ప్రశ్నించేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అలాగే మరికొంత మంది మాత్రమే ఆ విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న టికెట్ల రేట్ల విషయంలో థియేటర్స్ యాజమాన్యాలు కూడా అసంతృప్తిగానే ఉన్నాయి. మొత్తానికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ గా గుర్తింపును అందుకున్న ఒక థియేటర్ క్లోజ్ అవ్వగా ఆ విషయంలో ప్రభాస్ అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.

కరోనా దెబ్బ..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి పెద్ద సినిమాలు వెండితెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నిర్మాతలు భారీ స్థాయిలో బడ్జెట్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇండస్ట్రీ కరెక్ట్ గా ఎదుగుతున్న సమయంలోనే కరోనా దెబ్బ పడడం పెద్ద మైనస్ అని చెప్పాలి. దీంతో చాలా సినిమాలు రెండేళ్లకు పైగా వాయిదా వేసుకుంటూ వచ్చారు.

మరోవైపు ఏపీ దెబ్బ
ఒకవైపు కరోనా తో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మరోవైపు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు కూడా ఇండస్ట్రీని మరింత వెనక్కి నెట్టి వేసాయి. కరోనాతో పోరాడి సినిమాను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం టికెట్ల రేట్లను తగ్గించి చాలా అనుచితంగా ప్రవర్తిస్తుంది అని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కామెంట్ చేశారు.

అతిపెద్ద థియేటర్ క్లోజ్
మల్టీప్లెక్స్ థియేటర్స్ కు కూడా 30 రూపాయల టికెట్ కేటాయిస్తే థియేటర్ కరెంటు బిల్లు కూడా సరిపోవు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మొత్తానికి ఇండియా లోనే అతి పెద్ద స్క్రీన్ గా గుర్తింపును అందుకున్న థియేటర్ కు మూసివేశారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో అతిపెద్ద థియేటర్ గా గుర్తింపు అనుకున్న వి ఎపిక్ థియేటర్ను 2019లో మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

ప్రభాస్ అప్సెట్
ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ అయినటువంటి యు.వి.క్రియేషన్స్ వంశీ కృష్ణారెడ్డి థియేటర్ ను నెల్లూరులోని సూళ్లూర్ పెట్ లో భారీగా ఖర్చు చేసే నిర్మించారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్క్రీన్స్ లలో ఒకటిగా ఎపిక్ దియేటర్ కూడా స్థానం సంపాదించుకుంది. నెల్లూరు జిల్లాకు ఒక ఐకాన్ గా బాహుబలి థియేటర్ గా పిలవబడే ఆ థియేటర్ కు ఇటీవల కాలంలో మంచి ప్రాముఖ్యత కూడా పెరిగింది. ఇక ఆ థియేటర్ మూసెయ్యడంతో ప్రభాస్ కూడా అస్పెట్ అయినట్లు తెలుస్తోంది.

అలాంటి టికెట్స్ రేట్స్ ఉండడంతో..
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 30 రూపాయలు 20 రూపాయలు ఐదు రూపాయలు అంటూ టికెట్స్ రేట్లను నిర్ణయించడంపై థియేటర్స్ యాజమాన్యం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తరహాలో మల్టీప్లెక్స్ థియేటర్లు కొనసాగించడం ఏమాత్రం కరెక్ట్ కాదని అందుకే థియేటర్ మూసివేస్తున్నట్లు గా బోర్డులు తగిలించిచేశారు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం న్యూస్ వైరల్ గా మారింది.

సైలెంట్ గా క్లోజ్ చేయడం బెటర్..
కేవలం నెల్లూరు జిల్లాలోని కాకుండా చాలా ఏరియాల్లో కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ ను మూసివేస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ కూడా మూసివేసేందుకు థియేటర్స్ యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అనవసరంగా సినిమాలు ప్రదర్శించే నష్టపోయే కంటే సైలెంట్ గా క్లోజ్ చేయడం బెటర్ అని నిర్ణయించుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత వరకు కఠినంగా వ్యవహరిస్తుందో చూడాలి అని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











