నాని V ఎఫెక్ట్: ఇక టాలీవుడ్ ఆశలు అడియాశలే.. ఇక ఆ 8 సినిమాలు కూడా..

టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అనుకున్నట్లుగానే ఓటీటీ బాట పట్టింది. మొన్నటివరకు కేవలం చిన్న సినిమాలు మాత్రమే డిజిటల్ వరల్డ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. ఓ వైపు బాలీవుడ్ లో పెద్ద సినిమాలే థియేటర్స్ పై ఆశలు వదులుకోని ఓటీటీ ప్రపంచంలోకి వస్తుండగా ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయు. నాని తెగించడంతో అనుష్క సినిమా కూడా అదే తరహాలో రానున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది.

Recommended Video

Tollywood నిర్మాతల అడుగు ఎటువైపు ? లైన్ లో Red, Uppena సినిమాలు || Oneindia Telugu
నిశ్శబ్దం కూడా ఫిక్స్ అయినట్లే..

నిశ్శబ్దం కూడా ఫిక్స్ అయినట్లే..

ఇటీవల నిర్మాత కోన వెంకట్ నాని V ఓటీటీ రిలీజ్ పై స్పందిస్తూ.. మేము V కోసం వెయిట్ చేస్తున్నాం. మేము మీతో ఉన్నాం అనగానే అనుష్క నిశబ్దం కూడా ఓటీటీ డీలింగ్స్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. కోనవెంకట్ అనుష్క కాంబినేషన్ లో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్దం సినిమాను సమ్మర్ లోనే గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు.

ఆశలు చచ్చిపోయాయి.

ఆశలు చచ్చిపోయాయి.

కానీ లాక్ డౌన్ దెబ్బకు థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతనే నిశ్శబ్దం సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం అయ్యే అవకాశం లేదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక దిల్ రాజు లాంటి బడా నిర్మాతనే నాని V సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తుండడం చాలా మందిలో ఆశలు చచ్చిపోయాయి.

ఏకంగా 8 సినిమాలు

ఏకంగా 8 సినిమాలు

సమ్మర్ అనగానే హాలిడేస్ ఉంటాయని చాలా మంది నిర్మాతలు ఒక ఏడాది ముందే ప్లాన్ రెడీ చేసుకొని మార్చ్ తర్వాత సినిమాలను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కరొనా దెబ్బకు ప్లాన్స్ తారుమారయ్యాయి. దీంతో ఇప్పుడు ఏకంగా 8 సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేదు.

 వీళ్ళు కూడా ఓటీటీలోనే..

వీళ్ళు కూడా ఓటీటీలోనే..


రామ్ రెడ్ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా ఓటీటీ డీల్స్ కోసం చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, వైష్ణవ్ తేజ్ ఉప్పెన వంటి సినిమాలతో పాటు శర్వానంద్ శ్రీకారం అలాగే మాస్ మహారాజా క్రాక్ సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ కావాల్సిందే అనే కామెంట్స్ వస్తున్నాయి.

లేటయితే.. చాలా డేంజర్ అని

లేటయితే.. చాలా డేంజర్ అని


ఇదివరకే కొందరు నిర్మాతలు తాము డైరెక్ట్ గా థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతనే సినిమాలను రిలీజ్ చేస్తామని పట్టుదలతో చెప్పారు. అయితే వారిలో దిల్ రాజు లాంటి బలమైన నిర్మాతనే డౌన్ అవ్వడంతో మిగతా వారిలో కూడా ఆశలు అవిరయ్యాయి. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ మార్కెట్ ఉన్న సినిమా కూడా V అనే చెప్పాలి. లేటయితే సినిమా మార్కెట్ పై చాలా ఎఫెక్ట్ పడుతుందని దిల్ రాజు ఆ నిర్ణయం తీసుకున్నాడు. సో.. అంతటి సినిమానే ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది అంటే ఇక మిగతా సినిమాల నిర్మాతలు కూడా మరికొన్ని రోజుల్లో ఒప్పుకోక తప్పదనే టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X