‘జూనియర్ ఎన్టీఆర్ పేరు వింటే చాలు... తారకరత్న చివరి రోజుల్లో ఇలా’

నందమూరి తారక రామారావు కుమారుడు మోహనకృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు తారకరత్న. ఒకేసారి ఒకేరోజున 9 సినిమాలకు ప్రారంభోత్సవాలు జరుపుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఒకటో నెంబర్ కుర్రాడు, తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న వంటి సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ తరపున యాక్టీవ్‌గా ఉంటున్న దశలో కుప్పంలో నారా లోకేష్‌ ఆధ్వర్యంలో జరిగిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరులో చికిత్స పొందుతుండగా తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. చిన్నవయసులోనే తారకరత్న కన్నుమూయడంతో నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చివరి రోజుల్లో ఎలా గడిచింది? జూనియర్ ఎన్టీఆర్‌తో అనుబంధంపై తారకరత్న సన్నిహితుడు దర్శకుడు వి. సముద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

తారకరత్నతో వెంకటాద్రి, కాకతీయుడు, జై సేన అనే సినిమాలు తారకరత్నతో తీశాను. వెంకటాద్రి అనే సినిమా రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్‌లోనే ప్రసన్నగారు, మోహనకృష్ణగారు కలిసి చేశారు. అది వాళ్ల ప్రాఫిట్ సినిమా. శాటిలైట్ రైట్స్ మంచి రేట్ వచ్చాయి. తక్కువ బడ్జెట్‌లో అంత హైలెవ్ వచ్చింది. తారకరత్న అనుకున్న పెద్ద హిట్ అతనికి దక్కలేదు. నన్ను కలిసినప్పుడల్లా అన్నయ్య.. పెద్ద హిట్ కొట్టాలి, నాకు ఎవరి మీదా నమ్మకం లేదు నువ్వే అన్నయ్య మనం చేద్దాం అనేవాడు. నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం. ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది అని వి సముద్ర అన్నారు.

V Samudra Reveals about Nandamuri Tarakaratna s Bond with Jr NTR and his Final Days

3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా
తను ఇంకో 10 రోజుల్లో చనిపోతాడనగా 3 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఈసారి డిఫరెంట్ చేద్దాం అని చెప్పడంతో గడ్డం బాగా పెంచాడు. ఆ గడ్డంలో భలే ఉంటాడు. అంతా చేశాక ఫోటో సెక్షన్ చేయాలని అంటే యువగర్జనకు వెళ్లొచ్చాక చేద్దాం అన్నయ్య అన్నాడు. పొద్దున్నే యువగర్జనకు బయల్దేరతాడనగా.. నేను ఫోన్ చేస్తే నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీయవా అన్నాడు. ఇక్కడి కార్యక్రమం అయిపోగానే నైట్ బయల్దేరతానని అన్నాడు. బాగా ఫ్రెండ్ నాకు.. ఏది పర్సనల్ ఉన్నా నన్నే పిలిచి మాట్లాడతాడు. ఏదైనా ఉన్నా మా ఇంటికొచ్చి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్లం అని వి సముద్ర గుర్తు చేసుకున్నారు

తారకరత్న మరణవార్త తట్టుకోలేకపోయాం
వాళ్ల నాన్నగారితో చివరిలో మాటల్లేవు.. ఆ టైంలో నాన్నగారితో మాట్లాడాలని అనేవాడు. దాంతో నేను వేరే వంక పెట్టుకుని మోహనకృష్ణగారికి ఫోన్ చేసేవాడిని. తండ్రి మాట్లాడుతుంటే తారకరత్న వినేవాడు. మోహనకృష్ణగారు కూడా తారక్‌ని పసి పిల్లాడిలా చూసుకున్నారు. తారకరత్నకి కూడా తండ్రి అంటే అంత ప్రేమ. అంతా నాతో షేర్ చేసుకునేవాడు. వాడికి సముద్ర అంటే బాగా ఇష్టం.. సముద్ర దగ్గర ఉంటాడని వాళ్ల నాన్నగారికి కూడా తెలుసు. అలాంటి తారకరత్న చనిపోయాడని తెలియగానే నేను, నా భార్య తట్టుకోలేకపోయాం. నా భార్యను వదిన వదిన అంటూ చాలా బాగుంటాడు. ఇంటికొచ్చినప్పుడు వదిన ఇది తినాలనిపిస్తోంది ఇది చేయమని అడిగేంత స్వతంత్రం ఉంది. దాంతో మా ఆవిడ ఎక్కువగా బాధపడింది అని వి సముద్ర ఆవేదన వ్యక్తం చేశారు

నా తమ్ముడు అని గర్వపడేవాడు
తారకరత్నకు అందరూ అనుకున్నట్లుగా ఆర్ధికంగా ఇబ్బందులు లేవు. ఆయన భార్య చాలా స్ట్రాంగ్. తారకరత్న సినిమాలు చేస్తూనే వున్నాడు.. ఎక్కడా గ్యాప్ రాలేదు. పేమెంట్స్ అవన్నీ బాగానే వచ్చేవి. పొలిటికల్‌గా తిరిగి చేసేవాడు. అడ్జస్ట్‌మెంట్స్ కోసం అడిగేవాడు తప్పించి ఆర్ధికంగా ఇబ్బందులు లేవు. చనిపోయేముందు 12 కోట్ల రూపాయలు పెట్టి విల్లా కొన్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఫోన్ చేసి తమ్ముడు అంటూ బాగా మాట్లాడేవాడు. ఎక్కడ కలిసినా మా తమ్ముడు అని తారకరత్న గర్వంగానే చెప్పుకునేవాడు అని వి సముద్ర తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తారకరత్న మన మధ్యలో ఉంటే బాగుండేదంటూ ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X