twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవిలపై స్టార్ డైరెక్టర్ కామెంట్స్

    |

    ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ వీవీ వినాయ‌క్. స్టార్ హీరోలను మాస్ ఆడియన్స్‌కి దగ్గర చేయడంలో ఈయన పాత్ర చాలా పెద్దది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి నేటితరం హీరోలతో కూడా సినిమాలు చేసి భారీ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నారు వీ వీ వినాయక్. అందరు హీరోలతో కలివిడిగా ఉండటం ఈ డైరెక్టర్ లోని ప్రత్యేక లక్షణం. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీవీ వినాయక్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల మనస్తత్వాల గురించి చెప్పుకొచ్చారు.

    మెగాస్టార్ చిరంజీవి ఓ అద్భుతమైన నటుడని, గొప్ప వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయని వీవీ వినాయక్ అన్నారు. భార్యాపిల్లలతో ఎలా మెలగాలి, తమ్ముళ్లు, చెల్లెళ్లని ఎలా చూడాలి అనేది తాను చిరంజీవిని చూసే నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణ గురించిన స్పందించిన వీవీ వినాయక్.. ''వయసురీత్యా బాలకృష్ణ కంటే నేను చాలా చిన్నవాడిని. బాలకృష్ణ తో తీసిన చెన్నకేశవరెడ్డి నా రెండో సినిమానే. దర్శకుడిగా సీన్‌ వివరించడానికి ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు 'చెప్పండి గురువు గారూ' అని సంబోదించేవారు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. చిత్ర యూనిట్ సబ్యులకు గౌరవం ఇవ్వడంలో బాలకృష్ణను మించిన హీరో లేరు'' అన్నాడు.

    V. V. Vinayak Comments on Balakrishna, Jr, Ntr

    అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడిన వీవీ వినాయక్.. ''మేము ఆది సినిమా చేస్తున్నప్పుడు తారక్‌ కి కేవలం పదిహేడు, పద్దెనిమిదేళ్లు ఉంటాయేమో! షూటింగ్‌ స్పాట్‌లో బాగా అల్లరి చేసేవాడు. చిన్న వయసులోనే ఆయనకు కుటుంబ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. వాళ్ల ఫ్యామిలీకి తనే అండ దండ'' అన్నాడు.

    స్పెషల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వీవీ వినాయక్.. ఈ మధ్యకాలంలో కాస్త జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా డైరెక్టర్ నుంచి యాక్టర్ గా మారుతూ హీరో అవతారం ఎత్తబోతున్నాడు వీవీ వినాయక్. న‌ర‌సింహారావు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాత‌గా రూపొంద‌నున్న చిత్రంలో వినాయ‌క్ హీరోగా కెమెరా ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ ఆయన సరసన నటించనుందని సమాచారం.

    English summary
    Sensational Directer V. V. Vinayak turns as a hero. In this occation he says about Chiranjeevi, N. T. Rama Rao Jr, Nandamuri Balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X