కసరత్తులు మొదలెట్టిన వీవీ వినాయక్.. జిమ్‌లో వర్కవుట్స్.. వైరల్ అవుతున్న పిక్
స్పెషల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వీవీ వినాయక్ జోరు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే 'ఇంటెలిజెంట్' రూపంలో డిజాస్టర్ మూటగట్టుకున్న ఆయన డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారుతూ హీరో అవతారం ఎత్తబోతున్నాడు. నరసింహారావు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రంలో వీవీ వినాయక్ హీరోగా కెమెరా ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన సీనియర్ హీరోయిన్ శ్రీయ నటించనుందని సమాచారం.
హీరోగా నటించాలంటే కొత్తగా మేకోవర్ కావాల్సిందేగా. అందుకే జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టేశాడు వీవీ వినాయక్. మరికొద్ది రోజుల్లోనే వీవీ వినాయక్ హీరోగా రానున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ మేరకు ఇప్పటికే లుక్ మార్చేసిన వీవీ వినాయక్.. రోజూ గంటల తరబడి జిమ్ లోనే గడుపుతున్నాడట. తాజాగా ఆయన జిమ్‌లో వర్కవుట్స్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో వీవీ వినాయక్ చాలా స్లిమ్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ లో ఆయనను చూస్తుంటే వెండితెరపై హీరోగా అసరగొట్టేస్తాడేమో అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డైరెక్టర్ వీవీ వినాయక్‌కు నటించడం కొత్తేమీ కాదు. 'ఠాగూర్'లో ఆయన చేసిన చిన్న పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది. ఆయనలో మంచి నటుడు ఉన్నాడని ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెబుతుంటారు కూడా. పైగా ఈ సినిమా కథ వీవీ వినాయక్ కి బాగా సూట్ అయ్యే కథ అని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి హీరోగా వీవీ వినాయక్ స్టామినా ఎలా ఉంటుందనేది!.


Click it and Unblock the Notifications











