వీవీ వినాయక్ అక్రమ కట్టడాలపై కొరడా ఝలిపించిన జీహెచ్‌ఎంసీ
చట్టం ఎవ్వరికీ చుట్టము కాదని మరోసారి రుజువైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అది ఎవ్వరైనా ఊరుకునేదే లేదన్నట్లుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వ్యవహరించింది. ఈ మేరకు డైరెక్టర్ వీవీ వినాయక్ నిర్మిస్తున్న అక్రమ కట్టడంపై కొరడా ఝలిపించింది జీహెచ్‌ఎంసీ.
హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లిలో డైరెక్టర్ వీవీ వినాయక్ సరైన అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారు. అనుమతి లేకుండా అక్రమ భవన నిర్మాణాల నిర్మాణం చట్టరిత్యా నేరం. వీవీ వినాయక్ అక్రమంగా ఆరు అంతస్థుల భవనం నిర్మించినట్లు తెలియగానే విచారణ చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఆ భవన నిర్మాణం ట్రిపుల్ వన్ జీవోకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనుగొన్నారు.

గండిపేట పరిధిలో ఉన్న వట్టినాగులపల్లి అనే గ్రామం కొత్త జిల్లాలు రాకముందు గ్రామ పంచాయితీ ఆదీనంలో ఉండేది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఆ గ్రామం జీహెచ్ఎంసీ ఆధీనంలోకి వచ్చింది. అయితే గ్రామ పంచాయితీ పరిధిలో ఉండగానే జీ+2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న వినాయక్.. కొత్త జీవోను లెక్క చేయకుండా జి+6 భవన నిర్మాణం చేపట్టాడు. దీంతో ఇది గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలు ఆపేయాలని నోటీసులు జారీ చేశారు. కానీ దానిపై వీవీ వినాయక్ నుంచి స్పందన రాకపోవడంతో బరిలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఫ్లోర్లను కూల్చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు వీవీ వినాయక్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం.
చాలాకాలం తర్వాత ఇటీవలే వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఇంటిలిజెంట్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. మరికొద్ది రోజుల్లో వీవీ వినాయక్ హీరోగా ఒక సినిమా తెరెకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నారని, హీరోయిన్ గా శ్రీయ నటిస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications











