జగన్ మా ఇంటికొచ్చారు.. నేనే వద్దన్నా: సంచలన విషయాలు చెప్పిన స్టార్ డైరెక్టర్

సినిమా వాళ్లకు, రాజకీయ నేతలకు దగ్గరి సంబంధాలు ఉండటం సాధారణమే. అయితే ఏ మాత్రం ఊహించని విధంగా కొందరు స్టార్స్, పొలిటిషన్స్ లింకులు షాకిస్తాయి. ఈ కోవలోనే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాస్ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ వీవీ వినాయక్ మధ్య ఉన్న రిలేషన్ జనాన్ని ఆశ్చర్యపరుస్తోంది. జగన్ తో తనకున్న సంబంధాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వీవీ వినాయక్ వెల్లడించడం గమనార్హం.

తెలుగు సినిమాల్లో చాలామంది హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టి మాస్ స్పెషల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు వీవీ వినాయక్. ఆకట్టుకునే డైలాగ్స్, దానికి తగ్గ విజువలైజేషన్ చూపించడంలో వీవీ వినాయక్ ని మించిన డైరెక్టర్ లేడనే చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో కాస్త జోరు తగ్గించిన ఈ దర్శకుడు ఇక హీరో అవతారం ఎత్తబోతున్నాడు. ఈ మేరకు తాను హీరోగా కొత్త సినిమా రాబోతోందని ప్రకటించారు కూడా. ఇందులో సీనియర్ హీరోయిన్ శ్రీయ.. వీవీ వినాయక్ సరసన నటించనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో పాల్గొన్న వీవీ వినాయక్ సినీ, రాజకీయాలకు సంబందించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

 V. V. Vinayak told his personnel relation ship with Y. S. Jaganmohan Reddy

ఈ సందర్బంగా వైఎస్ ఫ్యామిలీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి వివరించి ఆశ్చర్య పరిచాడు. ఆయన మాట్లాడుతూ.. ''2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠంపై జగన్‌గారికి శుభాకాంక్షలు. మా నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యాన్. రాజకీయాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. మా తమ్ముడు సురేంద్ర ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. మా అమ్మ చనిపోయినప్పుడు మా ఇంటికి జగన్మోహన్‌రెడ్డి గారు వచ్చారు. ఒక సమయంలో వైఎస్ బావమరిది అయిన రవీందర్‌రెడ్డి గారు నన్ను కూడా పోటీచేయమని అన్నారు. కానీ అప్పట్లో మా అమ్మ ఒప్పుకోకపోవడం, నాకు కూడా అంత శక్తి లేదేమో అనే ఫీలింగ్ కలగటం కారణంగా వెనక్కి తగ్గాను. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడం గురించి ఆలోచిస్తా'' అని వీవీ వినాయక్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X