మహేశ్ వల్లే SSMB29 ఆలస్యం... మరొకరైతే మా ట్రీట్‌మెంటే వేరు, విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్
ఎన్టీఆర్- రామ్ చరణ్‌లతో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు తెలుగు సినిమాను మరో మెట్టుపైకి ఎక్కించారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను సాధించి టాలీవుడ్ స్టామినా ఏంటో రుజువు చేసింది. దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తన తర్వాత సినిమా ఉంటుందని రాజమౌళి ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇన్ని రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు #SSMB29పై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో మహేశ్ అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 29 ఆలస్యంపై రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
మహేశ్ - రాజమౌళి మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. యాక్షన్ అడ్వెంచర్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తారని ఫిలింనగర్ టాక్. ఇందుకోసం మహేశ్ బాబు కంప్లీట్‌గా మేకోవర్ అవుతున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాంగ్ హెయిర్‌తో రుషిలా సూపర్‌స్టార్ కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఎప్పుడూ క్లీన్ సేవ్‌తో రాయల్ లుక్‌లో కనిపించే మహేశ్ ఈ సినిమా కోసం గడ్డం కూడా పెంచారు.

ఈ సినిమా బడ్జెట్ ఎంత, మహేశ్ బాబు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లనే దానిపై సోషల్ మీడియాలో రోజుకొక న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. బడ్జెట్ ఎంత అనేది ఇంకా ఫిక్స్ కాలేదని, ఎంత అవసరం అనుకుంటే అంత ఖర్చు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రొడ్యూసర్ తేల్చి చెప్పారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి కొడుకు చేతికి అప్పగించగా.. జక్కన్న దానికి ఫైనల్‌గా రాజముద్ర వేయాల్సి ఉంది.
రోజులు గడుస్తున్నా ఎస్ఎస్ఎంబీ29 మూవీ అప్‌డేట్స్ ఏం బయటకు రాకపోవడంతో ఘట్టమనేని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు నాడు ఏదైనా పోస్టర్ వదులుతారని అనుకుంటే అక్కడా డిజప్పాయింట్ చేశారు. దీంతో మొన్నామధ్య మత్తువదలరా 2 టీమ్ ఏకంగా రాజమౌళి నుంచే వివరాలు లాగే ప్రయత్నం చేసింది. థియేటర్‌లో దేవర సినిమా చూడటానికి వచ్చిన జక్కన్న మహేశ్ ఫ్యాన్ ఒకరు ఎస్ఎస్ఎంబీ29 అప్‌డేట్స్ చెప్పమని గోల చేశాడు. అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఏమైనా స్పెషల్ అనౌన్స్ ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో రచయిత విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఎస్ఎస్ఎంబీ 29 ఎందుకు లేట్ అవుతుందో వివరించారు. తాము ఏ హీరోకైనా 3 నుంచి 4 వారాల్లో కథ రెడీ చేసేవాళ్లమని .. కానీ మహేశ్ లాంటి స్టారో హీరో నటిస్తున్న సినిమి కావడంతో స్టోరీ రెడీ చేయడానికి రెండేళ్లు పట్టిందని విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మహేశ్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణమేంటని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











