ప్రభాస్ ‘సలార్’లో మరో హీరోయిన్: ఆ పాత్రలో కనిపించబోతున్న బాలీవుడ్ బ్యూటీ
టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సలార్'. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఆలస్యంగా ప్రకటించినప్పటికీ.. ముందుగానే ఈ సినిమాను పట్టాలెక్కించేశారు. అందుకు అనుగుణంగానే ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా వెంటనే పూర్తి చేశారు. ఇక, రెండోది మొదలెట్టే ముందే కరోనా రెండో దశ ప్రారంభం అయింది. దీంతో ఈ షెడ్యూల్ వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బటయకు వచ్చింది.
'సలార్' మూవీలో కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ కూడా నటిస్తుందట. ఎంతో కీలకమైన ఈ పాత్ర కోసం ఆమెను చిత్ర యూనిట్ ఇటీవలే సంప్రదించిందని తెలిసింది. దీంతో వెంటనే ఆమె ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట. ఇక, ఈ మూవీలో వాణీ కపూర్ నటించే పాత్రపై క్లారిటీ లేనప్పటికీ.. కచ్చితంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న రోల్ అని అంటున్నారు. ఇది ఫ్లాష్‌బ్యాక్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనాలే వేస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఇధి 1970 నాటి కథతో సాగే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతుంది. ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు


Click it and Unblock the Notifications











