మహేష్ రికార్డును అందుకోలేకపోయిన అల్లు అర్జున్
టాలీవుడ్‌లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాలు సంక్రాంతి బాక్సాఫీస్ బరిలోకి దూకిన సత్తాను చాటాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసాయి. అయితే ఈ రెండు చిత్రాలు బుల్లితెరపై కూడా పోటీ పడి రికార్డు టీఆర్పీలు సాధించాయి. తొలిసారి అల వైకుంఠపురంలో టెలివిజన్ ప్రీమియర్ కాగా 29.4 పాయింట్ల టీఆర్పీని సాధించింది.
అయితే దీపావళీ పండగ సందర్భంగా మరోసారి బుల్లితెరపై ప్రదర్శించగా ప్రేక్షకులు పెద్దగా స్పందించలేదు. రెండోసారి కేవలం 7.91 పాయింట్ల టీఆర్పీతో సరిపెట్టుకొంది. అయితే ఈ విషయంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అధిక్యత ప్రదర్శించలేకపోయింది.

దీపావళీ పండుగ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు ప్రదర్శించగా.. ఏకంగా 17.4 పాయింట్ల టీఆర్పీ సాధించడం విశేషంగా చెప్పుకొంటున్నారు.
ఇదిలా ఉండగా, సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు సర్కారు వారీ పాట చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











