ఉప్పెన ప్రీరిలీజ్‌కు సాయిధరమ్ ఎందుకు రాలేదంటే!.. ప్రైవేట్ జెట్‌లో వచ్చే స్టామినా ఉన్నా.. వైష్ణవ్ క్లారిటీ
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పంజా వైష్టవ్ తేజ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12 రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ ఉప్పెన గురించి మాట్లాడకపోవడం, ట్వీట్ చేయకపోవడంపై స్పందిస్తూ...
అన్నయ్య సాయి ధరమ్ తేజ్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగా ఉంది. నా సినిమా గురించి ఏదైనా పోస్టు పెడుతా అంటూ అన్నయ్య అంటే నేనే వదని ఆపుతున్నాను.

ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి ధరమ్ తేజ్ రాకపోవడానికి కారణం ఆయన ఒంగోలులో షూటింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి రావడం, వెళ్లడం ఎందుకు రిస్క్ అని అనుకొన్నాం. తన వల్ల షూటింగ్‌కు డిస్ట్రబ్ కావొద్దని భావించాం అని వైష్ణవ్ తెలిపారు.
ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తప్పనిసరిగా రావాలనుకొంటే, నేను ఒత్తిడి చేసి ఉంటే సాయి ధరమ్ తేజ్ ప్రైవేట్ జెట్‌లో వచ్చి.. మళ్లీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లే కెపాసిటీ ఆయనకు ఉంది. కానీ అలా రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











