వైరలవుతోన్న ఉప్పెన ఫస్ట్ లుక్
మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం కాబోతోన్న మరో హీరో వైష్ణవ్ తేజ్. మెగా మేనళ్లుడు, సుప్రీమ్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న సాయి ధరమ్ తేజ్ సోదరుడే వైష్ణవ్ తేజ్. ఉప్పెన అంటూ వెండితెరకు పరిచయం కాబోతోన్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా అందరిలోనూ ఆసక్తిని రేకిత్తించిన చిత్రయూనిట్.. కాసేపటి క్రితమే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కథలో భాగంగా వైష్ణవ్ తేజ్ జాలరిగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ అంచనాలు పెంచేయగా.. తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసేశారు.

సుకుమార్ రైటింగ్స్ - మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామని అధికారికంగా ప్రకటించారు. ఎట్టకేలకు ఆలస్యమైనా.. మండే ఎండల్లో ఉప్పెనలా దూసుకొస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











