Kondapolam Twitter Review: మరోసారి క్రిష్ ప్రయోగం.. వైష్ణవ్ తేజ్ కు సెకండ్ సక్సెస్ వచ్చినట్లే
మొదటి సినిమాతోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇప్పుడు కొండపొలం అనే మరొక డిఫరెంట్ జానర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు సందేశాత్మక చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు అయితే అంచనాలు బాగానే ఉన్నాయి. తప్పకుండా సినిమా మంచి ప్రశంసలు అందుకుంటుందని పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా కూడా ప్రదర్శించడం జరిగింది. ఇక సినిమాను చూసిన వారు సోషల్ మీడియా ద్వారా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమా స్పెషల్ షో లో చూసేశారు.

డైరెక్టర్ క్రిష్.. మరో మంచి సినిమా
దర్శకుడు క్రిష్ గమ్యం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఆ తరువాత కూడా మంచి సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఏదో ఒక మంచి సందేశం ఉంటుంది. మంచి విలువలు బావోద్వేగమైన సన్నివేశాలతో దర్శకుడు క్రిష్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ తో కాస్త పరాజయాలతో ఉన్న క్రిష్ ఇప్పుడు మాత్రం మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు.

మెగాస్టార్ మొదటి రివ్యూ
ఇక ఇప్పటికే కొత్త మంది సినీ తారలు కొండపొలం ప్రివ్యూని ప్రత్యేక వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వారి కుటుంబ సభ్యులతో ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూ వీక్షించారు. ఇక ఎప్పటిలానే దర్శకుడు క్రిష్ మరోసారి తనదైనా శైలిలో మంచి సినిమాను తెరకెక్కించాడు అంటూ.. ఊహించినట్టుగానే వైష్ణవ్ తేజ్ చాలా చక్కగా నటించాడు అని మెగాస్టార్ పాజిటివ్ బూస్ట్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమని అందుకే క్రిష్ దర్శకత్వంలో సినిమా అనగానే సబ్జెక్ట్ చూడకుండా ముందుగా ఓకే చెప్పేసేయ్ అని వైష్ణవ్ కు చెప్పినట్లు తెలియజేశారు.. సినిమాలో అందరూ చాలా బాగా నటించారని టెక్నీషియన్స్ పనితనం కూడా వెండితెరపై కనిపించిందని చెప్పారు.

కంచె తరహలోనే ఎమోషన్స్
సోషల్ మీడియాలో కూడా పలువురు నెటిజన్లు ఈ సినిమాపై పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఎప్పటిలాగే తన లోని మంచి భావాలను ఈ సినిమా ద్వారా చాలా చక్కగా చూపించారు అని అంటున్నారు. గతంలో కంచె సినిమాలో ఎలాగైతే ఒక పోరాటపటిమను చూపించారో ఇప్పుడు కూడా కొండపొలం సినిమాలో అదే తరహాలో హీరో పాత్రను చాలా బాగా ఎలివేట్ చేశారని అంటున్నారు.

అందమైమ ప్రేమ..
ఒక చదువుకున్న యువకుడు ఫారెస్ట్ ఆఫీసర్ గా అవ్వాలని ఆ తర్వాత ఇంటర్వ్యూలలో విఫలమై మళ్లీ గొర్రెల కాపరి గా వెళతాడు. ఇక అతని ప్రయాణం చాలా విభిన్నంగా ఉందని ఇక ఆ ప్రయాణంలో అతనికి తోడుగా ఒక అందమైన ప్రేమ చాలా చక్కగా చూపించినట్లు అంటున్నారు. సినిమాలు వైష్ణవ్ తేజ్ నటన కూడా చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు.

రకుల్ పాత్రపై పాజిటివ్ గా
ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చాలా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఎక్కువగా గ్లామరస్ పాత్రలో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సారి ఇలాంటి పాత్ర ను సెలెక్ట్ చేసుకోవడంపై ప్రశంసించాల్సిన విషయం అని చెబుతున్నారు. ఇప్పటికే ఆమెకు పాటల ద్వారా మంచి కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా లోని పాత్రలు చూసిన తర్వాత ఇంకా ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి

కీరవాణి బెస్ట్ మ్యూజిక్
ఇక ఈ సినిమాకు సంగీతాన్ని కీరవాణి అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పాటలు సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. వెండితెరపై పాటలు విన్న తర్వాత మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది అని కీరవాణి టాలెంట్ ఏమిటో మరోసారి రుజువైందిని కూడా చెబుతున్నారు. ఇక సాంగ్స్ మేకింగ్ కూడా చాలా నాచురల్ గా ఉంది ఉందని పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











