Adikeshava: చిరంజీవి బర్త్‌డేకే మెగా హీరో మూవీ.. ఫ్యాన్స్‌కు పండుగే పండుగ
టాలీవుడ్‌లోనే మెగా ఫ్యామిలీది ప్రత్యేకమైన స్థానం. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి దాదాపు పది మంది వరకూ హీరోలుగా పరిచయం అవ్వడమే. అంతేకాదు, వాళ్లలో చాలా మంది స్టార్లుగా వెలుగొందుతున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత పలు సినిమాలతో వచ్చినా పెద్దగా విజయాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న లక్ష్యంతో 'ఆదికేశవ' అనే సినిమాలో నటిస్తున్నాడు.
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే దర్శకుడితో కలిసి 'ఆదికేశవ' అనే సినిమాను చేస్తున్నాడు. డివోషనల్ టచ్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

డివోషనల్ కాన్సెప్టుతో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'ఆదికేశవ' మూవీ ఆగస్టు 18వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి అధికారికంగా తేదీని వెల్లడించింది. ఇందులో వైష్ణవ్ తేజ్‌తో పాటు హీరోయిన్ శ్రీలీలను చూపించారు. ఇక, ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ రెండింటికి చాలా తక్కువ గ్యాపే ఉంది. అంటే.. మెగా అభిమానులకు వరుసగా పండుగలే అని చెప్పాలి.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఆదికేశవ' ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే దీని నుంచి విడుదలైన టీజర్ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది.


Click it and Unblock the Notifications











