Adikeshava Postponed: వైష్ణవ్ తేజ్ మూవీ మళ్లీ వాయిదా.. షాకింగ్ కారణం చెప్పిన నిర్మాత

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి మూవీతోనే సెన్సేషన్ అయిన హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ ఒకడు. 'ఉప్పెన' చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఏకంగా వంద కోట్ల కలెక్షన్లతో సత్తా చాటుకున్నాడు. అయితే, ఆ తర్వాత మాత్రం పలు సినిమాలతో వచ్చినా.. సక్సెస్‌లను మాత్రం సొంతం చేసుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'ఆదికేశవ' అనే సినిమాను చేస్తున్నాడు.

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే దర్శకుడితో కలిసి 'ఆదికేశవ' అనే సినిమాను చేస్తున్నాడు. డివోషనల్ టచ్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయింది. దీంతో దీన్ని నవంబర్ 10వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ వాయిదా పడినట్లు తెలిపింది.

Vaishnav tej Starrer Adikeshava Release Postponed to November 24th

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' సినిమాను ముందుగా ప్రకటించినట్లుగా నవంబర్ 10వ తేదీన విడుదల చేయడం లేదని నిర్మాత నాగవంశీ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోన్న నేపథ్యంలో సినిమాలకు కలెక్షన్లు తగ్గిపోతున్నాయని చెప్పిన ఆయన.. ఈ కారణంగానే 'ఆదికేశవ' మూవీని నవంబర్ 24వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. అప్పుడు మాత్రం ఎన్ని సినిమాలు ఉన్నా.. ఎలాంటి పోటీ ఏర్పడినా విడుదల మాత్రం కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. 'ఆదికేశవ' సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు మంచి ఆదరణను అందుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X