విడుదలకు సిద్దమైన వైష్ణవ్ తేజ్ మరో కొత్త సినిమా.. 'అంగరంగ వైభవంగ' రిలీజ్ డేట్ ఫిక్స్!
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వైష్ణవి తేజ్ మొదటి సినిమాతోనే వంద కోట్ల బిజినెస్ ను క్రియేట్ చేసుకున్న హీరో గా రికార్డు కెక్కాడు. అంతేకాకుండా హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఆ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. మొదటి సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వీరికి పదుల సంఖ్యలో ఆఫర్లు అయితే వచ్చాయి. కానీ మొదట్లోనే తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని కాస్త నిదానంగానే వెళ్తున్నారు. ఇక వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా కంటే ముందుగానే ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే ఒక సినిమాను పూర్తి చేశాడు.
కొండపొలం సినిమా నటన పరంగా వైష్ణవ్ తేజ్ కు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కూడా కమర్షియల్గా సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ వైష్ణవ్ తేజ్ రేంజ్ అయితే ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని తదుపరి సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా 'అంగరంగ వైభవంగ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి కి సహాయక దర్శకుడిగా పనిచేసిన గిరీషయ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ దర్శకుడు తమిళంలో అర్జున్ రెడ్డి ని కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

ఇక అంగరంగ వైభవంగా సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై కూడా చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాను జూలై 1వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ విసిసి ప్రొడక్షన్ ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ హీరోయిన్ కేతికశర్మ నటిస్తోంది. గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా నిలిచిన కేతిక ఈ సినిమాలో మాత్రం సింపుల్ గా పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. ఇక అంగరంగవైభవంగా సినిమాలో వైష్ణవ్ తేజ్ ఒక మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకోవాలని వైష్ణవ్ తేజ్ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ లో కూడా త్వరలోనే మొదలు పెట్టాలి అని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే విడుదలైన ఒక డైలాగ్ టీజర్ కూడా మంచి స్పందన లభించింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే సినిమాలోని ఐదు పాటలను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఒక్కొక్క ఒక పాటను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











