వైష్ణవ్ తేజ్ ఉప్పెన అప్‌డేట్.. రేపే ఫస్ట్ లుక్

మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే వస్తోంది. చిరంజీవి-పవన్ కళ్యాణ్ ఇంకా జోరుమీదు ఉండగానే అల్లు అర్జున్-రామ్ చరణ్-వరుణ్ తేజ్-సాయి ధరమ్ తేజ్-అల్లు శిరీష్-కళ్యాణ్ దేవ్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉంటుంది. ఈ లిస్ట్‌లోకి సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా చేరిపోయాడు. మరో మెగా హీరో కూడా రంగంలోకి దిగబోతోన్నట్లు టాక్ వినిపించింది. ఆ విషయం కాస్త పక్కన పెడితే.. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చేసింది.

సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్ అప్పట్లో ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ మసాలా అంశాలకు పోకుండా, రా నెరేషన్‌లోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్. మత్స్యకారుల జీవన శైలి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం.

Vaishnav Tej Uppena Movie First Look On 23rd January

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోను విలన్ రోల్‌కు తీసుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ నుంచి ఇన్నాళ్లకు ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రేపు (జనవరి 23)సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X