Uppena Trailer: ప్రేమకు భవిష్యత్తు ఉండదు.. టెర్రిఫిక్‌గా విజయ్ సేతుపతి

మెగాఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న మరొక హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో రానున్న ఈ హీరోపై మెగా అభిమానుల్లోనే కాకుండా ఇతర సినీ లవర్స్ లో కూడా అంచనాలు భారిగానే పెరుగుతున్నాయి. ఇక మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాల డోస్ పెంచారు. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు.

ట్రైలర్ అంతకుమించి..

ట్రైలర్ అంతకుమించి..

సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్క సాంగ్ తోనే దేవిశ్రీప్రసాద్ పవర్ఫుల్ బజ్ క్రియేట్ చేశాడు. ఆ ఒక్క పాటతోనే ఉప్పెనలా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ అంతకు మించి అనేలా బజ్ క్రియేట్ చేసింది. ఓ వైవు ప్రేమ మరోవైపు భయంకరమైన విలనిజం కనిపిస్తోంది.

భయపెడుతున్న విజయ్ సేతుపతి

భయపెడుతున్న విజయ్ సేతుపతి


ముఖ్యంగా విజయ్ సేతుపతి మాత్రం బయపెట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. ప్రేమ చరిత్రలోనే నిలిచిపోవాలి.. సంతోషంగా భవిష్యత్తులో పిల్లా పాపాలతో ఉంటే దాని విలువ తగ్గిపోతుంది అనేలా విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్ ఊహించని విదంగా ఉంది. చూస్తుంటే అతను ఈ సినిమాలో చాలా భయంకరమైన పెర్ఫెమెన్స్ ను బయటపెట్టినట్లు అర్థమవుతొంది.

ఇంట్రెస్టింగ్ గా ఉంది

హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా అయినా కూడా నవారసాలను పర్ఫెక్ట్ గా పండించినట్లు అర్ధమవుతోంది. ప్రేమతో పాటు ఎమోషన్ సీన్స్ లో కూడా పర్ఫెక్ట్ గా చూపించినట్లు టాక్. హీరోయిన్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే సినిమా రోటీన్ కథ అయినప్పటికీ మేకింగ్ విజన్ తోనే దర్శకుడు బుచ్చిబాబు పర్ఫెక్ట్ గా తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది.

మంచి ఛాన్స్ మిస్ అయ్యింది..

మంచి ఛాన్స్ మిస్ అయ్యింది..

ఇక సినిమా బిజినెస్ పై కూడా అంచనాల డోస్ పెరిగాయి. ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక గోల్డెన్ ఆఫర్ ను నిర్మాతలు వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా అవుట్ రేట్, రెండు రాష్ట్రాల థియేటర్ హక్కులను 18కోట్లకు అమ్మే ఛాన్స్ వచ్చిందట. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుకుమార్ కు ఒక బయ్యర్ ఈ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే బిజినెస్ డీల్స్ చాలా వరకు క్లోజ్ అయ్యాయట.

మంచి రేటుకే అమ్మారట

మంచి రేటుకే అమ్మారట

ముఖ్యంగా నైజాం హక్కులను నాలుగున్నర కోట్లకు సీనియర్ నిర్మాత దిల్ రాజుకు అమ్మేశారని తెలుస్తోంది. అలాగే మిగతా ఏరియాల హక్కులు కూడా మంచి రేటుకే అమ్మరట. అందుకే ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా ఫిబ్రవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఓటీటీలో ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక సంక్రాంతి రావాలని అనుకున్నారు గాని థియేటర్స్ కు 100% ఆక్యుపెన్సీతో నడిచే వరకు విడుదల చేయకూడదని మళ్ళీ వెనక్కి తగ్గారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X