సప్తగిరి హీరోగా ‘వజ్ర కవచధర గోవింద’.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది
స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న 'వజ్ర కవచధర గోవింద'
మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో గోవిందు అనే ఫన్నీ దొంగ పాత్రలో సప్తగిరి కనిపించబోతున్నారు, ఆ దొంగ తన లక్ష్య సాధనలో చేసే పనులు ఆసక్తికరంగా ఉంటాయట. అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. మా కాంబినేషన్లో వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ లాంటి భారీ విజయం తర్వాత రూపొందిస్తున్న వజ్ర కవచధర గోవింద అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో చేస్తున్నాం. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో, ఆ అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. మా కథకు అనుగుణంగానే పవర్‌ఫుల్‌గా వజ్ర కవచధర గోవింద అనే టైటిల్ పెట్టామని తెలిపారు.

నిర్మాతలు నరేంద్ర యెడల , జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ... షూటింగ్ 80 శాతం పూర్తయింది. మిగిలిన సన్నివేశాలను కర్ణాటక లోని ఒక గుడిలో తెరకెక్కిస్తాం. టైటిల్ ప్రకటించగానే మా సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అటెన్షన్ బాగా పెరిగింది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్' లాంటి సూపర్ హిట్ తర్వాత సప్తగిరి, అరుణ్ పవార్ కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం మాకు దక్కడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: జి టి ఆర్ మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.


Click it and Unblock the Notifications











