ఆ స్టార్ హీరో సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన వేణు శ్రీరామ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వేణు శ్రీరామ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. వకీల్ సాబ్ సినిమాపై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడంతో ఈ దర్శకుడిపై అనేక రకాల కథనలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పింక్ కథను వకీల్ సాబ్ గా రీమేక్ చేసిన వేణు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకునేలా ఉన్నాడని టాక్ వస్తోంది.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బూకింగ్స్ తో సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. దాదాపు హైదరాబాద్ లోని అన్ని ఏరియాల్లో మొదటిరోజు హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వనున్నాయి. అయితే ఆ సినిమా తరువాత వేణు శ్రీరామ్ ఎవరితో వర్క్ చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగిపోయిన ఒక ఒక సినిమాపై క్లారిటీ ఇచ్చాడు.

వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ అనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అప్పట్లో ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే బన్నీ ఎందుకో సడన్ గా కొరటాల శివకు కమిట్ అవ్వడంతో వేణు శ్రీరామ్ ప్రాజెక్టుపై కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు కూడా ఆ సినిమాపై ఇంకా క్లారిటీ లేదని బహుశా వకీల్ సాబ్ అనంతరం తన తదుపరి సినిమాలపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వివరణ ఇచ్చాడు. మరి వకీల్ సాబ్ హిట్టయితే బన్నీ ఇతనితో సినిమా చేస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











