తెర మీదకు జనసేనాని.. వకీల్ సాబ్‌‌పై మంచు మనోజ్ కామెంట్స్.. ఫ్యాన్స్ ప్రస్తావన తెస్తూ!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి ఇప్పుడు కెమెరా ముందుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రెండేళ్లు జనసేనానిగా జనంలో తిరుగుతూ న్యాయ పాలన కోసం పోరాడిన ఆయన.. ఇక ఈ వేసవిలో 'వకీల్ సాబ్‌' రూపంలో న్యాయకోవిదుడుగా సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (మర్చి 2) ఈ 'వకీల్ సాబ్‌' లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ చూసి పలువురు సెలబ్రిటీలు స్పందించగా, మంచు మనోజ్ కాస్త ఆసక్తికరంగా స్పందించారు. వివరాల్లోకి పోతే..

 పవన్ కళ్యాణ్ 26.. పింక్ రీమేక్

పవన్ కళ్యాణ్ 26.. పింక్ రీమేక్

పవన్ కళ్యాణ్ 26వ సినిమాగా 'వకీల్ సాబ్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘పింక్' సినిమాను తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

జనాల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తూ..

జనాల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తూ..

ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. త్వర త్వరగా షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేస్తూ ఇప్పటికే 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసింది. పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఉన్న అంచనాల దృష్ట్యా ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఈ మేరకు పవర్‌ఫుల్ పవన్ లుక్ రిలీజ్ చేసి జనాల్లో ఆసక్తిని రెట్టింపు చేశారు.

'వకీల్ సాబ్' ఫస్ట్‌లుక్.. పవన్ స్టైల్

'వకీల్ సాబ్' ఫస్ట్‌లుక్.. పవన్ స్టైల్

'వకీల్ సాబ్' ఫస్ట్‌లుక్ పోస్టర్ మెగా అభిమానులనే గాక యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో వకీల్ సాబ్‌గా పవన్ స్టైల్ చూసి ఫిదా అవుతున్నారంతా. చేతిలో బుక్ పట్టుకొని కళ్ళజోడు ధరించి.. ఇంటి సామానుల మధ్యలో పవన్ కూర్చున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట హంగామా చేస్తోంది.

మంచు మనోజ్ రియాక్షన్.. ఇక పండగే

మంచు మనోజ్ రియాక్షన్.. ఇక పండగే

ఈ పోస్టర్ చూసిన యంగ్ హీరో మంచు మనోజ్ తన స్పందనను సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ''సంవత్సరంలో ఉన్న పండగలన్నీ ఫ్యాన్స్ ఒక్క రోజులోనే జరుపుకునేలా ఉందిగా పోస్టర్. సూపర్.. త్వరలోనే తెరమీద కనపడనున్న జనసేనాని పవన్ కళ్యాణ్‌కి, వకీల్ సాబ్ టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్'' అంటూ ట్వీట్ చేశాడు మంచువారబ్బాయి.

 వకీల్ సాబ్ రిలీజ్ డేట్.. థమన్ మ్యాజిక్

వకీల్ సాబ్ రిలీజ్ డేట్.. థమన్ మ్యాజిక్

ఇకపోతే వకీల్ సాబ్ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల కానుంది. మే 23న ఈ సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.

మెగా అభిమానుల్లో ఆతృత.. ఎక్కడ చూసినా!!

పింక్ రీమేక్ మొదలైనప్పుడే పవన్ రీ ఎంట్రీని త్వరగా వెండితెరపై చూసేయాలనే కుతూహలం జనాల్లో మొదలైంది. అయితే ఆ కుతూహలాన్ని రెట్టింపు చేసేలా ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేసి, పవన్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడంతో మెగా అభిమానుల్లో ఆతృత మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వకీల్ సాబ్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X