వివాదాల బోనులో వకీల్ సాబ్... తెలంగాణలో థియేటర్ల బంద్.. రూమర్లను ఖండించిన అధికారులు
తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి అతలాకుతలం చేసేందుకు కరోనా మహమ్మారి సిద్దమైంది. ప్రాణాంతక వైరస్ ప్రభావంతో ఇప్పటికే నిర్మాతలు షూటింగులను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమాలను ప్రదర్శించలేమని థియేటర్ యాజమాన్యం చేతులెత్తేసింది. దాంతో తెలంగాణ సర్కార్ సందిగ్దంలో పడింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే...

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం, కేసుల సంఖ్య ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. దీంతో థియేటర్ యాజమాన్యాలకు షాక్ తగిలింది. ఇప్పటికే అతంత మాత్రంగా ఉన్న ఆక్యుపెన్సీకి కర్ఫ్యూ అంశం ప్రతికూలంగా మారడంంతో సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

తెలంగాణలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో
తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే కర్ఫ్యూ కారణంగా ఫస్ట్ షో, సెకండ్ షోల ప్రదర్శనకు అంతరాయం కలిగేలా ఉండటంతో సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించారు. కరోనా బారిన ప్రేక్షకులు పడకుండా ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు వెల్లడించారు.

ఏప్రిల్ 21 నుంచి థియేటర్ల మూసివేత
సమావేశమనతరం ఏప్రిల్ 21వ తేదీ నుంచి థియేటర్లు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే వకీల్ సాబ్‌ను ప్రదర్శించడానికి మొగ్గు చూపడం చర్చనీయాంశమైంది.

వివాదంగా వకీల్ సాబ్ ప్రదర్శనలు
అయితే తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్ సినిమాను ప్రదర్శించే థియేటర్లకు మూసివేత నుంచి మినహాయించడం వివాదంగా మారింది. వకీల్ సాబ్‌కు మినహాయింపు ఎందుకు ఇచ్చారనే అంశంపై థియేటర్ ఓనర్లు, ఎగ్జిబిటర్లూ క్లారిటీ ఇవ్వకపోవడం రకరకాల ఊహాగానాలకు కారణమైంది. దాంతో ప్రభుత్వ అధికారులు స్పందించాల్సి వచ్చింది.

ప్రభుత్వానికి సంబంధం లేదంటూ..
తెలంగాణ వ్యాప్తంగా థియేటర్ల మూసివేత అనేది ఎగ్జిబిటర్ల నిర్ణయం. ఈ అంశంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే బహుశా దానికోసం ఎక్కువ డబ్బులు పెట్టి ప్రదర్శన హక్కులు కొని ఉంటారు. అయితే ఈ నిర్ణయంలో పూర్తిగా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని అంశం. ఎగ్జిబిటర్ల వ్యాపారపరమైన నిర్ణయం అయి ఉంటుందని నా అంచనా అని ప్రభుత్వ అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications











