ఉమెన్స్ డే స్పెషల్: 'మగువా మగువా' సెన్సేషన్.. రంగంలోకి పవన్ కళ్యాణ్.. ఆడవాళ్ళ గురించి అలా!!
అజ్ఞాతవాసి సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్లకు తిరిగి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. బాలీవుడ్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్' ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులకు ఆణిముత్యం లాంటి సాంగ్ రిలీజ్ చేశారు.
Recommended Video

థమన్ హింట్స్.. పవన్ అభిమానుల్లో ఆత్రుత
వకీల్ సాబ్ నుంచి రాబోయే ఈ పాటపై ఎప్పటి నుంచో థమన్ తన ట్వీట్స్ ద్వారా హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాడు. రామ జోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌పై యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఈ ఫస్ట్ సింగిల్‌ను పాడబోతోన్నట్లు హింట్ ఇచ్చాడు. దీంతో ఈ సాంగ్ కోసం పవన్ అభిమానుల్లో ఆత్రుత నెలకొంది.

''మగువా మగువా'' ప్రోమో.. కాసేపట్లోనే!
ఇక ఆత్రుత రెట్టింపయ్యేలా ఇటీవలే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ''మగువా మగువా'' అంటూ సాగిపోయిన ఈ సాంగ్ ప్రోమో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. విడుదలైన కాసేపట్లోనే లక్షల్లో వ్యూస్ రాబట్టి ఫుల్ సాంగ్‌పై భారీ హైప్ తీసుకొచ్చింది.
మగువా మగువా.. లోకానికి తెలుసా నీ విలువా.. ఫుల్ సాంగ్
ఈ నేపథ్యంలో నేడు మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఈ ''మగువా మగువా.. లోకానికి తెలుసా నీ విలువా'' ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఊహించినట్లుగానే ఈ సాంగ్ ఆడవాళ్ళ విలువను తెలుపుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్, సిధ్ శ్రీరామ్ ఆలాపన ఈ పాటకు ప్రాణం పోశాయి.

సినిమాపై అంచనాలు రెట్టింపు
రాజు - శిరీష్ నిర్మిస్తున్న ఈ 'వకీల్ సాబ్' సినిమాకి బోనీకపూర్, దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పవన్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. అంతేకాదు పవన్ లుక్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను రెండింతలు చేసింది.

పవన్ సరసన ముగ్గురు భామలు
ఇకపోతే ఈ 'వకీల్ సాబ్' సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. పవన్ సరసన నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో నివేదా థామస్ రోల్ సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది. గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఆమె పాత్ర ఉండనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











