వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ డేట్.. అసలు క్లారిటీ ఇచ్చేశారు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన వకీల్ సాబ్ మొత్తానికి అభిమానులకు మంచి కిక్కిచ్చింది. అజ్ఞాతవాసి గాయాన్ని ఈ సినిమా తుడిచేసింది. వకీల్ సాబ్ విడుదలను అభిమానులు ఒక పండగలా సెలబ్రెట్ చేసుకున్నారు. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ డోస్ పెంచింది.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ మరో సెంచరీ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. వరల్డ్ వైడ్ గా సినిమా 90కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక సినిమా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న క్రమంలో ఓటీటీ రిలీజ్ డేట్ లీక్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరక్ అయ్యాయి. ఇక ఆ విషయం పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కొంత కన్ఫ్యూజన్ కు గురి చేసింది.

ఇక మొత్తానికి చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో కన్ఫ్యూజన్ తొలగింది. ఇప్పట్లో వకీల్ సాబ్ ఓటీటీలో వచ్చే అవకాశమే లేదని సినిమా థియేటర్లలోనే ఇంకొన్నాళ్లు ఉంటుందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక వకీల్ సాబ్ కు సోమవారం కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పండగ వాతావరణంలో సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందని టాక్ వస్తోంది. పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. ఇక థమన్ మ్యూజిక్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











