వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రెడీ.. ఇక రికార్డులు బద్దలే!!

ఎన్నాళ్ల నుంచో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. పవర్ స్టార్ బర్త్ డే, వకీల్ సాబ్ అప్డేట్, మిగతా చిత్రాల ప్రకటన ఇలా రేపు ఎన్నెన్నో సర్ ప్రైజ్‌లున్నాయి ఫ్యాన్స్‌కి. ఈ క్రమంలో రేపు ముచ్చటగా మూడు అప్డేట్‌లను వదలబోతోన్నారు. అందులో ముఖ్యంగా మొదటగా రానున్నది వకీల్ సాబ్ గురించే. మామూలుగా అయితే ఈ పాటికే సినిమా విడుదలై బాక్సాఫీస్ పని పట్టాల్సింది. కానీ కరోనా వల్ల అంతా తారుమారైంది.

మొత్తానికి రేపు (స్టెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రచ్చ చేయబోతోన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బర్త్ డేను నేషనల్ వైడ్‌గా ట్రెండ్ చేసేందుకు యుద్దం చేపట్టారు. నేటి సాయంత్రం ఆరు గంటలకు మొదలెట్టిన ట్వీట్ల యుద్దం రేపు సాయంత్రం ఆరింటికి పూర్తి కానుంది. ఇప్పటికే #HBDPawanKalyan అనే హ్యాష్ జాతీయ స్థాయిలో హల్చల్ చేస్తోంది. ఇక కోలీవుడ్ నుంచి అజిత్, విజయ్ ఫ్యాన్స్ క్లబ్‌లు సైతం ఈ ట్రెండ్‌లో పాల్గొన్నాయి. పవన్‌కు ప్రత్యేకంగా విషెస్ కూడా చెప్పాయి.

Vakeel Saab Motion Poster At 9 09 AM On 2nd September

అదంతా అటుంచితే.. రేపు వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రిలీజ్ కాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. రేపు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మోషన్ పోస్టర్ రాబోతోంది చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే వకీల్ సాబ్ నుంచి విడుదలైన మగువా మగువా సాంగ్ రెండు తెలుగు రాష్ట్రాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళలను మాత్రం ఈ పాట తెగ మెప్పించింది. ఇక రేపు రాబోయే మోషన్ పోస్టర్ ఎలా ఉండబోతోందో, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X