వకీల్ సాబ్ న్యూ స్టిల్ లీక్.. పవన్ కళ్యాణ్ నెవర్ బోఫోర్ లుక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా వకీల్ సాబ్. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన ఒక లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Recommended Video

పవన్ కళ్యాణ్ స్టిల్ లీక్..
సినిమాకు సంబంధించిన ఆ స్టిల్ లీక్ అయినట్లు తెలుస్తోంది. పవన్ లాయర్ లుక్ లో కేసును వాదిస్తున్నట్లు ఉన్న ఆ ఫోటో అభిమానులను బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిసారి పవన్ ఒక లాయర్ సాబ్ గా కనిపించబోతున్నాడు. దీంతో అంచనాల డోస్ తారా స్థాయికి చేరింది.

ఆ స్టిల్ ఎలా వచ్చిందంటే..
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ స్టిల్ కూడా VFX ఎడిటింగ్ వర్క్ నుంచి స్క్రీన్ షాట్ తీసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సినిమా ఫస్ట్ లుక్ తప్పితే మరొక అఫీషియల్ పోస్టర్ ని విడుదల చేయలేదు. ఆ మధ్య రిలీజ్ చేసిన మగువ మగువ సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం ట్తెలిసిందే.

చాలా రోజుల తరువాత..
సాధారణంగా సినిమా షూటింగ్ మొదలైనప్పుడే ఒక లొకేషన్ ఫోటో రిలీజ్ కాగా.. అదే ఎక్కువగా వైరల్ అయ్యింది. అనంతరం వకీల్ సాబ్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా మరింత వైరల్ అయ్యింది. ఇక చాలా రోజుల తరువాత మరొక లుక్ వైరల్ కాగా సినిమాపై అంచనాల డోస్ కూడా పెరుగుతోంది.

త్వరలోనే స్పెషల్ అప్డేట్..
పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ లో ఉన్న సమయంలో ఉహీంచని విదంగా లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం కూడా షూటింగ్ ని కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా మారారు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ లుక్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











