కోర్టుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్.. క్లీన్ షేవ్‌తో పవర్ స్టార్.. అనుమానాలు రేకెత్తిస్తున్న పిక్!

అవును.. మీరు చూసింది నిజమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోర్టుకు వెళ్తున్నారు. క్లీన్ షేవ్‌తో అలా ఓ చేతిలో ఫైల్, మరో చేతిలో బ్యాగ్ పట్టుకొని అలా ఆయన నడుకుంటూ వెళ్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంతకీ పవన్ కోర్టు బాట ఎందుకు పట్టారు? ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వివరాయలు చూద్దామా..

వకీల్ సాబ్.. పవన్ కళ్యాణ్

వకీల్ సాబ్.. పవన్ కళ్యాణ్

రెండేళ్ల పాటు రాజకీయాలతో బిజీ అయిన అనంతరం పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్‌గా మారిన సంగతి తెలిసిందే. అదేనండీ! ఆయన తాజా సినిమా 'వకీల్ సాబ్' గురించే మనం మాట్లాడుకునేది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ 26.. పింక్ రీమేక్

పవన్ కళ్యాణ్ 26.. పింక్ రీమేక్

పవన్ కళ్యాణ్ 26వ సినిమాగా 'వకీల్ సాబ్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘పింక్' సినిమాను తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రమోషన్స్ మొదలుపెట్టిన యూనిట్.. పవన్ లుక్

ప్రమోషన్స్ మొదలుపెట్టిన యూనిట్.. పవన్ లుక్

ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. ఇప్పటికే 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసింది. పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఉన్న అంచనాల దృష్ట్యా ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఈ మేరకు పవర్‌ఫుల్ పవన్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి జనాల్లో ఆసక్తిని పెంచేశారు.

కోర్టుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్

కోర్టుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్

ఇదిలాఉంటే పవన్ అభిమానులు కూడా తమ వంతుగా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ రెడీ చేస్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాయర్‌గా కోర్టుకు వెళ్తున్నట్లుగా పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన లుక్ ఒకటి రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది.

Recommended Video

Prabhas - The Charity King In Tollywood | Filmibeat Telugu
 క్లీన్ షేవ్‌తో పవర్ స్టార్.. అనుమానాలు

క్లీన్ షేవ్‌తో పవర్ స్టార్.. అనుమానాలు


అయితే ఈ పోస్టర్ లో పవన్ క్లీన్ షేవ్‌తో కనిపిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తోంది. గతంలో విడుదల చేసిన ‘వకీల్ సాబ్' ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ గుబురు గడ్డంతో కనిపించారు. దీంతో ఫ్యాన్స్ పవన్ లుక్ ఇలా ఎందుకు క్రియేట్ చేశారనేదానిపై చర్చలు ముదిరాయి. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X