మెగా ఫ్యాన్‌కు గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో క్రేజీగా ప్రారంభించారు. ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల వేగం పెంచారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక కోసం భారీగా అంటే దాదాపు కోటి రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

Vakeel Saab pre release event will organise with one crore budget at hyderabad

తాజా రిపోర్టుల ప్రకారం.. ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిద్దరిని పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఆహ్వానించినట్టు తెలుస్తున్నది.

మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ మూవీతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తున్నది.

బాలీవుడ్ చిత్రం పింక్ మూవీ ఆధారంగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్‌కు దర్శకుడు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, శృతిహాసన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, నరేష్, ముఖేష్ రుషి, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X