ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ స్పూర్తితో... భావోద్వేగమైన ప్రేమకథగా భగత్ సింగ్ నగర్..

తెలుగు వెండితెరపై దేశభక్తి ప్రధానంగా సినిమాలు అరుదుగా వస్తుంటాయి. దేశభక్తితోపాటు ప్రేమకథను జోడించిన ఎన్నో చిత్రాలు మంచి విజయాలను అందుకొన్నాయి. అలాంటి కోవలో వస్తున్న చిత్రమే భగత్ సింగ్ నగర్. ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్న సమయంలో ఆ చిత్రం గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తూ.. దర్శక, నిర్మాత వాలాజా క్రాంతి చెప్పిన విషయాలు మీకోసం..

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం‌పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం భగత్ సింగ్ నగర్. తెలుగు, తమిళ భాషలో ఏక కాలంలో విడుదలకు సిద్ధమవుతున్నది. అతి త్వరలో మిగిలిన పాటలతో పాటు ఈ సినిమాను నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Valaja Kranti about Bhagat Singh Nagar: Set to release on November

ఈ సందర్భంగా. చిత్ర నిర్మాతలు రమేష్ వుడుత్తు, వాలాజా గౌరి లు మాట్లాడుతూ.. దేశం కోసం,స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. ఎక్కడో పుట్టి పెరిగిన బ్రిటీష్ వారు మన దేశంలో అడుగుపెట్టి వారి సామ్రాజ్యాన్ని ఇండియాలో స్థాపించాలన్న వారి కలను చెదరగొట్టి వారిని, వారి సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయం లోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. ఇలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా తీసినందుకు మా కెంతో గర్వంగా ఉంది..పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల చేస్తాం అన్నారు.

చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ .. నటుడు బెనర్జీ హెల్ప్‌తో లెజండరీ ప్రకాష్‌రాజ్ మా చిత్రం టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. భగత్ సింగ్ రాసిన ఒక లైన్‌ను ఆదర్శంగా తీసుకొన్నాం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది అని చెప్పారు.

Valaja Kranti about Bhagat Singh Nagar: Set to release on November

భగత్ సింగ్ నగర్‌లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. నాకు భగతసింగ్ అంటే ఎంతో ఇష్టం. ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగత్ సింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునే వాడిని. ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో... సాటి మనిషికి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలనుకునే గొప్ప వ్యక్తి. అలాంటి మంచి ఆలోచనతో ఈ సినిమా తీస్తున్నాము అని వాలాజా క్రాంతి ఎమోషనల్ అయ్యారు.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ భగత్ సింగ్ నగర్ చిత్రం టీజర్‌ను ఆవిష్కరించిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. చరిత చూపని లిరికల్ సాంగ్ కు పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌కు వెళ్లబోతున్నాం. మంచి కంటెంట్ తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మన అలోచలను మన చుట్టూ ఉన్న కథల్ని మన భగతసింగ్ గారి భావజాలాన్ని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో వస్తున్నాం. మా ప్రయత్నాన్ని మీరంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు తీయడానికి మా లాంటి కొత్త దర్శకులకు అవకాశం వస్తుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అని వాలాజా క్రాంతి అన్నారు.

నటీనటులు: విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు
సినిమాటోగ్రఫి: రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి
ఎడిటింగ్: జియాన్ శ్రీకాంత్,
స్టిల్స్: మునిచంద్ర
నృత్యం: ప్రేమ్-గోపి
మ్యూజిక్: ప్రభాకర్ దమ్ముగారి
ప్రొడ్యూసర్స్: వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు
కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X