Prabhas ఆదిపురుష్‌లో హైలెట్‌గా ఫైట్ సీన్.. భారీగా ఖర్చు.. కానీ, తేడా కొడుతుందే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దాదాపుగా డార్లింగ్ చేతిలో 6 పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఆదిపురుష్. రామాయణ గాథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా మొదటి నుంచి పలు వివాదాలు, విమర్శలకు గురి అవుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై పెద్దగా హోప్స్ పెట్టుకోవడం మానేశారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏకంగా ఆరు: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక తర్వాత వచ్చే సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. అందులో మొదటి ఆదిపురుష్. ఈ సినిమాతో పాటు డార్లింగ్ ప్రభాస్ మరో ఆరు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇవన్నీ పెద్ద ప్రాజెక్ట్స్ కావడంతో హోప్స్ పెరిగిపోతున్నాయి.
దెయ్యాలు ఉన్నట్లుగా: అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ను విడుదలకు ముందే టీజర్ ద్వారా ఘోరంగా నిరాశ పరిచిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా టీజర్ పై అనేక రకాల కామెంట్స్, ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. హాలీవుడ్ హిట్ చిత్రాలైన ప్లానేట్ ఆఫ్ ది ఏప్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, పైరెట్స్ ఆఫ్ ది కరెబియన్ నుంచి కాపీ కొట్టి వింత జీవులను సృష్టించారని ఆరోపించారు. ఈవిల్ డెడ్ లో దెయ్యాలు ఉన్నట్లుగా ఆ వింత జీవులేంటని మీమ్స్ తో కడిగేశారు.

పెద్దగా లేని ప్రభావం: ఇక వీటన్నింటిపైనా డైరెక్టర్ ఓం రావత్ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇందులోని పాత్రల వేషధారణపై పలు సంఘాలు, పూజారులు పెద్ద ఎత్తున విమర్శించారు. రామాయణం గాథను వక్రీకరిస్తున్నారంటూ డైరెక్టర్ ఓం రావత్ పై నిప్పులు చెరిగారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం కొన్నిరోజులకు సద్దుమణిగింది. ఇటీవలే శ్రీ రామ నవమి సందర్భంగా ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్ కాగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ప్రాముఖ్యత కలిగిన: ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇప్పుడు తాజాగా ఆదిపురుష్ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ అభిమానులకు సంతోషాన్నిచ్చేలా ఉంది. జూన్ 16న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టేశారు. తాజా అప్డేట్ ప్రకారం ఇందులోని ఓ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందట. హిందువుల ఇతిహాసమైన రామయణంలో గొప్ప ప్రాముఖ్యత కలిగింది వాలీ-సుగ్రీవుల పోరాటం. ఇప్పుడు ఇది సినిమాకే హైలెట్ కానుందట.

డిజాస్టర్ సన్నివేశం: వాలీ-సుగ్రీవుల పోరాట దృశ్యాలను పూర్తిగా వీఎఫ్ఎక్స్, సీజీఐలో రూపొందించారట. అందుకే ఆదిపురుష్ మూవీకే ఈ యాక్షన్ సీన్స్ హైలెట్ కానుందని చిత్రబృందం పేర్కొందట. ఇక ఈ సీన్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారని టాక్. ఇదిలా ఉంటే ఇదివరకు విడుదలైన టీజర్ ద్వారా గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూశారు ప్రేక్షకులు. మరి ఈ సీన్ కూడా అలానే ఉంటే హైలెట్ అవ్వడం ఏమో కానీ డిజాస్టర్ సీన్ గా మిగిలే అవకాశం ఉందని, తేడా కొట్టకుండా చూసుకోండని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











