స్టార్ డైరెక్టర్‌తో మహేశ్ బాబు మీటింగ్: అంటే ఆ సినిమా ఆగిపోలేదా!
'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. దీని తర్వాత మహేశ్ చేయబోయే సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. రాజమౌళితో సినిమా ప్రకటించినప్పటికీ.. దాని కంటే ముందే మరో డైరెక్టర్‌తో సినిమా చేస్తాడని అంటున్నారు.
'సర్కారు వారి పాట' తర్వాత మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి 'మహర్షి' వంటి భారీ హిట్‌ను అందించిన వంశీ పైడిపల్లితో భేటీ అవడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా వీళ్లిద్దరూ ఫ్యామిలీలతో కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా వీళ్ల మధ్య ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ మధ్య మహేశ్.. వంశీతో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. ఇందుకోసం మాఫీయా బ్యాగ్‌డ్రాప్‌తో ఓ కథను కూడా సిద్ధం చేశాడని వార్తలు వచ్చినా ఇది కార్యరూపం దాల్చలేదు.

మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లి తాజాగా మరోసారి కలవడంతో ఆగిపోయిందనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నారని ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా, వంశీ ప్రస్తుతం తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడు. ఇది కూడా క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్ పూర్తయిన వెంటనే మహేశ్ బాబుతో చేయబోయే సినిమా మీద ఫోకస్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఈ లోపు సూపర్ స్టార్ కూడా 'సర్కారు వారి పాట'ను పూర్తి చేస్తాడని వినికిడి.


Click it and Unblock the Notifications











