twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లాప్ ఇచ్చానని నన్నెప్పుడూ ప్రభాస్ అలా చూడలేదు: వంశీ పైడిపల్లి

    |

    'మహర్షి' మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి సూపర్ హ్యాపీగా కనిపిస్తున్నారు. రైతుల గురించి ఒక అద్భుతమైన సబ్జెక్టును తన సినిమా ద్వారా చెప్పడంతో పాటు ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని తీసుకెళ్లిన ఈ దర్శకుడు యూనిక్ రెస్పెక్ట్ సొంతం చేసుకున్నారు.

    'మహర్షి' ప్రమోషన్లో భాగంగా వివిధ చానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్న వంశీ పైడిపల్లి... తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఎప్పటికైనా ప్రభాస్‌కు ఒక మంచి విజయం అందిస్తానని వ్యాఖ్యానించారు.

     Vamsi Paidipally says he will prepare a script for Prabhas

    2007లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'మున్నా' చిత్రం ద్వారా వంశీ పైడిపల్లి దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తొలి ప్రయత్నంలో భారీ ప్లాప్ రుచి చూశాడు.. తన కెరీర్ నుంచి ఈ మచ్చను తొలగించుకునేందుకు త్వరలోనే ప్రభాస్ కోసం మంచి స్క్రిప్టును సిద్ధం చేస్తాను, ఆయన్ను ఒప్పించి విజయవంతమైన సినిమా చేస్తానని తెలిపారు.

    కొందరు హీరోలు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌ను బ్యాడ్‌గా చూడటం, అవాయిడ్ చేయడం లాంటివి చేస్తారు. కానీ ప్రభాస్ తన పట్ల ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని వంశీ చెప్పుకొచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటూ ప్రశంసలు గుప్పించారు.

    'మహర్షి' విజయానందంలో ఉన్న వంశీ ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. తన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుంది? ఎలాంటి సినిమా చేయబోతున్నాను అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.

    మే 9న విడుదలైన 'మహర్షి' ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 170 కోట్ల గ్రాస్‌తో పాటు రూ. 100 కోట్ల షేర్ వసూలు చేసింది. యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ తప్ప దాదాపు అందరూ లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

    English summary
    Directior Vamsi Paidipally first film Munna did not click. He says that very soon, he will prepare a script for Prabhas and will make sure that he will give a good hit with him some time or the other. Vamsi Paidipally is a Tollywood film director who is known for directing the films Brindavanam, Yevadu & Oopiri . He won Filmfare Award for Best Director - Telugu for the film Oopiri.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X