వాణి విశ్వనాథ్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ

సినీ పరిశ్రమలో హీరోయిన్ల కూతురు ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్, అమృతాసింగ్ కుమార్తె సారా అలీ ఖాన్ లాంటి వాళ్లు ఇండస్ట్రీకి పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. తాజాగా దక్షిణాదిలో 80, 90 దశకాల్లో ప్రేక్షకులను తన గ్లామర్‌తో ఉర్రూతలూగించారు. అయితే అలాంటి టాప్ హీరోయిన్ వారసత్వాన్ని పుచ్చుకొని వర్షా విశ్వనాథ్ సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వర్ష సోదరి ప్రియా విశ్వనాథ్ కూతురు. వర్ష వ్యక్తిగత, కుటుంబ నేపథ్యం వివారాల్లోకి వెళితే..

వర్షా విశ్వనాథ్ కేరళలోని త్రిచూర్‌లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ఇప్పటికే తమిళంలో మూడు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో రెడ్డిగారింట్లో రౌడీయిజం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Vani Viswanaths Sister daughter Varsha Vishwanath Tollywood entry

ఎం.రమేశ్‌, గోపీ సంయుక్తంగా దర్శకత్వంలో, శిరీషారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమణ్ సరసన వర్ష నటిస్తున్నారు. రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా పూర్తి కాకుండానే మరో రెండు చిత్రాల్లో నటించేందుకు అంగీకరించారు. జర్నలిస్టు, దర్శకుడు వట్టికూటి చంద్ర రూపొందించే చిత్రంలో రమణ్‌తో నటించనున్నారు. అలాగే సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరితో ఓ సినిమా చేయడానికి వర్షా విశ్వనాథ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Vani Viswanaths Sister daughter Varsha Vishwanath Tollywood entry

ఇక వాణి విశ్వనాథ్ కెరీర్ విషయానికి వస్తే.. చిన్న కృష్ణుడు చిత్రం ద్వారా 1988లో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిరంజీవితో కొదమ సింహం, ఘరానామొగుడు చిత్రాలో నటించారు. అలాగే తెలుగులో సింహ స్వప్నం, సాహసమే నా ఊపిరి లాంటి చిత్రాల్లో నటించారు. మలయాళం, తమిళంలో కలిపి 100కుపైగా చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X